Brahmanaidu: టీడీపీ నన్ను చంపాలనుకుంటోంది: వైసీపీ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు

TDP trying to kill me says YSRCP MLA Brahmanaidu
  • వినుకొండలో నిన్న టీడీపీ, వైసీపీ శ్రేణుల మధ్య ఘర్షణ
  • కర్రలు, రాళ్లతో దాడి చేసుకున్న ఇరు వర్గాలు
  • తనపై దాడిలో 400 మంది పాల్గొన్నారన్న బ్రహ్మనాయుడు

పల్నాడు జిల్లా వినుకొండ నిన్ని యుద్ధ రంగాన్ని తలపించిన సంగతి తెలిసిందే. వైసీపీ నేతల అక్రమ మట్టి తవ్వకాలను నిరసిస్తూ టీడీపీ చేపట్టిన నిరసన ర్యాలీ చివరకు హింసాయుతంగా మారింది. టీడీపీ, వైసీపీ శ్రేణులు కర్రలు, రాళ్లతో దాడులు చేసుకున్నారు. ఈ దాడిలో పలువురికి గాయాలయ్యాయి. మరోవైపు బ్రహ్మనాయుడు కారుపై కూడా టీడీపీ శ్రేణులు దాడి చేశాయి. 

ఈ నేపథ్యంలో బ్రహ్మనాయుడు మాట్లాడుతూ టీడీపీపై విమర్శలు గుప్పించారు. తనను అంతం చేసి ఎన్నికల్లో గెలవాలని టీడీపీ భావిస్తోందని చెప్పారు. తనపై దాడిలో దాదాపు 400 మంది పాల్గొన్నారని అన్నారు. తనను అడ్డు తొలగించుకుంటే వినుకొండలో సులభంగా గెలవొచ్చని టీడీపీ భావిస్తోందని చెప్పారు. టీడీపీ శ్రేణుల దాడిలో తన గన్ మెన్ కు కూడా గాయాలయ్యాయని తెలిపారు.

  • Loading...

More Telugu News