YS Avinash Reddy: సీఎం జగన్‌తో అవినాశ్‌ రెడ్డి భేటీ

kadapa mp avinash reddy meets cm jagan
  • వివేకా హత్య కేసులో అవినాశ్‌రెడ్డిని నిందితుడిగా చేర్చిన సీబీఐ
  • ఇటీవల సీబీఐ కోర్టులో సాక్షుల వాంగ్మూలాలతో చార్జ్‌షీట్‌ దాఖలు
  • ఈ నేపథ్యంలో జగన్‌తో అవినాశ్ భేటీకి ప్రాధాన్యం

ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ను కడప వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డి కలిశారు. ఈ రోజు తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జగన్‌తో భేటీ అయ్యారు. మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడిగా అవినాశ్‌రెడ్డిని సీబీఐ చేర్చిన సంగతి తెలిసిందే. దీనిపై పలుమార్లు అవినాశ్‌ను విచారించిన అధికారులు.. ఇటీవల సీబీఐ కోర్టులో చార్జ్‌షీట్‌ కూడా దాఖలు చేశారు. అందులో కీలకమైన పలువురు సాక్షుల వాంగ్మూలాలను సీబీఐ వెల్లడించింది. ఈ నేపథ్యంలో జగన్‌తో అవినాశ్ సమావేశం కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

  • Loading...

More Telugu News