Vijay Varma: జియో సినిమాలో 'కాల్ కూట్' వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ .. కథ తిరిగేది ఈ అంశం చుట్టూనే!

  • విజయ్ వర్మ ప్రధానమైన పాత్రగా 'కాల్ కూట్'  
  • ఒక యువతిపై జరిగిన యాసిడ్ దాడి చుట్టూ తిరిగే కథ 
  • పోలీస్ డ్రామా నేపథ్యంలో నడిచే వెబ్ సిరీస్  
  • 8 ఎపిసోడ్స్ తో కూడిన ఫస్టు సీజన్

Kaalkoot  Web Series Update

బాలీవుడ్ సినిమాలు ... హిందీ వెబ్ సిరీస్ లు చూసేవారికి విజయ్ వర్మను ప్రత్యేకంగా పరిచయం చేయవలసిన అవసరం లేదు. ఇంతవరకూ ఆయన ఎక్కువగా విలన్ పాత్రలను .. నెగెటివ్ షేడ్స్ కలిగిన పాత్రలను చేస్తూ వచ్చాడు. అలాంటి ఆయన తొలిసారిగా ఒక పాజిటివ్ పాత్రను పోషించాడు .. ఆ హిందీ వెబ్ సిరీస్ పేరే 'కాల్ కూట్'. 

అజిత్ అంధారే .. అమృత్ పాల్ సింగ్ .. ఆనంద్ తివారి ఈ వెబ్ సిరీస్ ను నిర్మించారు. సుమిత్ సక్సేనా ఈ వెబ్ సిరీస్ కి దర్శకత్వం వహించాడు. ఇందులో రవిశంకర్ త్రిపాఠి అనే పోలీస్ ఆఫీసర్ గా విజయ్ వర్మ కనిపిస్తాడు. ఆయన పాత్రను ప్రధానంగా చేసుకుని ఈ పోలీస్ డ్రామా నడుస్తుంది. తన కుటుంబం పట్ల మాత్రమే కాదు .. ఈ సమాజం పట్ల కూడా బాధ్యత కలిగిన పోలీస్ ఆఫీసర్ పాత్రను విజయ్ వర్మ పోషించాడు.

 ఓ యువతిపై జరిగిన యాసిడ్ దాడి కేసును ఆయన ఎలా డీల్ చేస్తాడు? మంచితనానికి అమాయకత్వం .. అసమర్ధత అనే బోర్డులు తగిలించేవారికి ఆయన ఎలాంటి సమాధానం ఇస్తాడు? అనేది ఈ కథలో ఆసక్తికరమైన అంశం. ఈ రోజున రెండు ఎపిసోడ్స్ ను వదిలారు. రేపటి నుంచి ఒక్కో ఎపిసోడ్ స్ట్రీమింగ్ అవుతూ, ఆగస్టు 2వ తేదీన స్ట్రీమింగ్ అయ్యే 8వ ఎపిసోడ్ తో సీజన్ 1 పూర్తవుతుంది.

More Telugu News