Gudem Mahipal Reddy: గుండెపోటుతో పటాన్‌చెరు ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి కుమారుడి మృతి

Pathancheru BRS MLA Gudem Mahipal Reddy Son Vishnu Vardhan Reddy Dies
  • కిడ్నీలు పాడవడంతో కొన్ని రోజులుగా కాంటినెంటల్ ఆసుపత్రిలో చికిత్స
  • ఈ తెల్లవారుజామున 2 గంటలకు మృతి
  • విషాదంలో ఎమ్మెల్యే కుటుంబం
పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి పెద్ద కుమారుడు విష్ణువర్ధన్‌రెడ్డి గుండెపోటుతో ఈ తెల్లవారుజామున మృతి చెందారు. ఆయన వయసు 30 సంవత్సరాలు. కిడ్నీలు పాడవడంతో కొన్ని రోజులుగా ఆయన కాంటినెంటల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

ఈ క్రమంలో తెల్లవారుజామున రెండు గంటల సమయంలో గుండెపోటుకు గురై మృతి చెందినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. కుమారుడి మృతితో మహిపాల్‌రెడ్డి కుటుంబం విషాదంలో మునిగిపోయింది. విష్ణువర్ధన్ మృతదేహాన్ని కొద్దిసేపటి క్రితం ఇంటికి తరలించారు. మరికాసేపట్లో అంత్యక్రియలు జరిగే అవకాశం ఉంది.
Gudem Mahipal Reddy
BRS
Pathancheru
Vishnu Vardhan Reddy

More Telugu News