Chiranjeevi: చిరంజీవిని చూడగానే కన్నీళ్లు ఆగలేదు, ఆయనా భావోద్వేగానికి లోనయ్యారు: నటి సుజిత

Actor sujitha talks about meeting chiranjeevi on jai chiranjeeva sets after many years
  • చిరంజీవి హీరోగా ‘పసివాడి ప్రాణం’లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించిన సుజిత
  • మళ్లీ ‘జై చిరంజీవ’లో మెగాస్టార్‌ను చూసిన వైనం
  • కొన్నేళ్ల తరువాత చిరంజీవిని చూశాక కన్నీరుపెట్టుకున్నానని వెల్లడి
  • తనను చూసి ఆయన కూడా భావోద్వేగానికి లోనయ్యారన్న సుజిత
  • ఆ క్షణంలో సెట్ మొత్తం సైలెంట్ అయిపోయిందని వెల్లడి
టీవీ ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించుకున్న నటి సుజిత బాలనటిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. ప్రస్తుతం పలు సీరియళ్లలో నటిస్తూ బిజీగా ఉన్నారు. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో మెగాస్టార్ చిరంజీవితో కలిసి ‘జై చిరంజీవ’లో నటించిన రోజులను గుర్తు చేసుకున్నారు. ఎప్పుడో చిన్నప్పుడు చూసిన తనను మళ్లీ ఇన్నాళ్లకు చూశాక చిరంజీవి భావోద్వేగానికి లోనయ్యారని చెప్పారు. 

‘‘చిరంజీవిగారు నటించిన ‘పసివాడి ప్రాణం’లో నేను చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించాను. ఆ తరువాత నేను మళ్లీ చిరంజీవి గారిని చూసింది ‘జై చిరంజీవ’ షూటింగ్‌లోనే. జై చిరంజీవ ఆఫర్ వచ్చినప్పుడు.. ఎన్నో ఏళ్ల తరువాత ఆయన్ని కలుస్తున్నాననే ఆనందంతో ఉన్నా. ఫస్ట్ డే సెట్‌లో ఆయన్ని పట్టుకుని కన్నీళ్లు పెట్టుకున్నా. ఆయన కూడా ఉద్వేగానికి లోనయ్యారు. ఆ క్షణం సెట్ మొత్తం సైలెంట్ అయిపోయింది’’ అని సుజిత చెప్పుకొచ్చారు.
Chiranjeevi
Sujitha
Tollywood

More Telugu News