Telangana: భారీ వర్షాల నేపథ్యంలో.. తెలంగాణలో రెండు రోజుల పాటు పాఠశాలలకు సెలవులు

Telangana Government announced two days holiday for schools
  • భారీ వర్షాలు పడే అవకాశం వున్నట్లుగా వాతావరణ శాఖ హెచ్చరికలు
  • బుధ, గురువారం విద్యా సంస్థలకు సెలవులు ఇవ్వాలని సీఎం కేసీఆర్ ఆదేశాలు
  • తక్షణమే ఉత్తర్వులు జారీ చేయాలని విద్యాశాఖకు సూచన
హైదరాబాద్ సహా తెలంగాణ వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తుండటంతో విద్యా సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం మరోసారి సెలవులు ప్రకటించింది. బుధ, గురువారాలు విద్యార్థులకు సెలవులు ప్రకటించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు తక్షణమే ఉత్తర్వులు జారీ చేయాలని విద్యా శాఖ మంత్రి, అధికారులను ఆదేశించారు. దీంతో 26, 27 తేదీల్లో విద్యాసంస్థలకు సెలవు ఉంటుంది. భారీ వర్షాల నేపథ్యంలో గత గురువారం నుండి శనివారం వరకు మూడు రోజుల పాటు సెలవులు ప్రకటించారు. వర్షాలు తగ్గడంతో సోమవారం నుండి పాఠశాలలు ప్రారంభమయ్యాయి. అయితే మళ్లీ భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించడంతో ప్రభుత్వం సెలవులు ఇవ్వాలని నిర్ణయించింది.
Telangana
schools
rains

More Telugu News