Kotamreddy Sridhar Reddy: టీడీపీ నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఇంఛార్జ్‌గా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి

Kotamreddy Sridhar reddy as TDP Nellore Rural incharge
  • చంద్రబాబునాయుడు ఆదేశాల మేరకు ఇంచార్జ్‌గా నియమించినట్లు వెల్లడి
  • ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర అధ్యక్షుడు
  • లోకేశ్ పాదయాత్రను అట్టహాసంగా నిర్వహించిన కోటంరెడ్డి
తెలుగుదేశం పార్టీ నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఇంఛార్జిగా ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని ఆ పార్టీ నియమించింది. ఈ మేరకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. తమ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు శ్రీధర్ రెడ్డిని ఇంఛార్జ్ గా నియమించినట్లు తెలిపారు.  

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పాదయాత్రను నెల్లూరు రూరల్ లో ఎమ్మెల్యే కోటంరెడ్డి ఆధ్వర్యంలో అట్టహాసంగా.. కనీవినీ ఎరుగని రీతిలో నిర్వహించారు. నెల్లూరు రూరల్ లో తెలుగుదేశం పార్టీ బలోపేతమే లక్ష్యంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఈ మేరకు ఆదేశాలు ఇవ్వడంతో రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ మేరకు కోటంరెడ్డి కూడా తన ఫేస్ బుక్ ద్వారా పోస్ట్ చేశారు.
Kotamreddy Sridhar Reddy
Nellore District
Telugudesam

More Telugu News