hd devegouda: బీజేపీతో పొత్తుపై తేల్చేసిన మాజీ ప్రధాని దేవెగౌడ

HD Deve Gowda Says His Party Will Contest Lok Sabha Polls Independently
  • లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ-జేడీఎస్ కలిసి వెళ్తాయనే ప్రచారాన్ని తిప్పికొట్టిన దేవెగౌడ
  • ఒకటిరెండు సీట్లు వచ్చినా స్వతంత్రంగానే పోటీ చేస్తామని స్పష్టీకరణ
  • నాటి పరిస్థితులను బట్టి భవిష్యత్తు కార్యాచరణను నిర్ణయిస్తామని ట్విస్ట్
2024 లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ-జేడీ(ఎస్) మధ్య పొత్తు ఉంటుందనే ప్రచారంపై ఆ పార్టీ అధినేత, మాజీ ప్రధాని దేవెగౌడ స్పందించారు. బీజేపీతో ఎన్నికల పొత్తు పెట్టుకునే అవకాశాలను ఆయన తోసిపుచ్చారు. కర్ణాటకవాసుల ప్రయోజనాల దృష్ట్యా కాంగ్రెస్ కు వ్యతిరేకంగా... బీజేపీతో కలిసి పని చేస్తామని కుమారస్వామి గతవారం ప్రకటించారు. దీంతో వచ్చే ఎన్నికల్లో రెండు పార్టీలు చేతులు కలుపుతాయనే ఊహాగానాలు వచ్చాయి. అయితే ఈ ప్రచారాన్ని దేవెగౌడ తాజాగా కొట్టిపారేశారు.

తాము లోక్ సభ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామన్నారు. ఒకటి రెండు సీట్లు వచ్చినా సరే స్వతంత్రంగా పోటీ చేస్తామన్నారు. పార్టీలో సంప్రదింపుల అనంతరం బలంగా ఉన్న స్థానాల్లో అభ్యర్థులను బరిలోకి దింపుతామన్నారు. అదే సమయంలో నాటి పరిస్థితులను బట్టి భవిష్యత్తు కార్యాచరణను నిర్ణయిస్తామని కూడా మరో మాట చెప్పారు. ఇటీవల బెంగళూరులో నిర్వహించిన ప్రతిపక్షాల సమావేశానికి తనను ఆహ్వానించినప్పటికీ, రాష్ట్ర కాంగ్రెస్ లోని ఓ వర్గం వ్యతిరేకించినట్లు చెప్పారు.
hd devegouda
BJP
jds
Karnataka

More Telugu News