Vanama Venkateswara Rao: వనమా వెంకటేశ్వరరావు ఎమ్మెల్యే పదవిపై అనర్హత వేటు.. జలగం వెంకట్రావును ఎమ్మెల్యేగా ప్రకటించిన హైకోర్టు

TS High Court disqualifies Kothagudem BRS MLA Vanama Venkateswara Rao
  • కొత్తగూడెం బీఆర్ఎస్ ఎమ్మెల్యే వనమాకు షాక్
  • వనమా ఎమ్మెల్యే ఎన్నిక చెల్లదని హైకోర్టు తీర్పు
  • రెండో స్థానంలో ఉన్న జలగం వెంకట్రావును ఎమ్మెల్యేగా ప్రకటించిన హైకోర్టు
కొత్తగూడెం బీఆర్ఎస్ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరావుకు తెలంగాణ హైకోర్టు షాకిచ్చింది. వనమా ఎమ్మెల్యే ఎన్నిక చెల్లదని సంచలన తీర్పును వెలువరించింది. అసెంబ్లీ ఎన్నికల్లో రెండో స్థానంలో నిలిచిన జలగం వెంకట్రావును ఎమ్మెల్యేగా ప్రకటించింది. 2018 నుంచి ఇప్పటి వరకు వనమా ఎమ్మెల్యే పదవీకాలం చెల్లదని స్పష్టం చేసింది. ఎన్నికల అఫిడవిట్ లో వనమా తప్పుడు వివరాలను ఇచ్చారంటూ 2018లో హైకోర్టును జలగం వెంకట్రావు ఆశ్రయించారు. ఈ పిటిషన్ పై సుదీర్ఘంగా విచారణ జరిపిన హైకోర్టు వనమా ఎన్నిక చెల్లదని తీర్పును వెలువరించింది. అంతేకాదు, ఎన్నికల అఫిడవిట్ లో తప్పుడు సమాచారం ఇచ్చినందుకు రూ. 5 లక్షల జరిమానా విధించింది. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున వనమా గెలిచారు. ఆ తర్వాత ఆయన బీఆర్ఎస్ లో చేరారు.
Vanama Venkateswara Rao
Kothagudem
BRS
MLA
TS High Court

More Telugu News