Sakshi Singh Dhoni: సినిమాల వైపు రావడానికి కారణం అదే: LGM ప్రెస్ మీట్ లో సాక్షి సింగ్ ధోని

LGM Press Meet
  • ఆగస్టు 4వ తేదీన రిలీజ్ కానున్న 'LGM'
  • ధోని బ్యానర్ నుంచి వస్తున్న ఫస్టు మూవీ 
  • జోరుగా జరుగుతున్న ప్రమోషన్స్
  • సినిమాల పట్ల ఇంట్రెస్ట్ తోనే నిర్మాతగా మారానన్న సాక్షి 
ఎమ్మెస్ ధోని - ఆయన శ్రీమతి కలిసి తమ సొంత బ్యానర్లో మొదటి సినిమాగా 'LGM'ను నిర్మించారు. రమేశ్ తమిళమణి దర్శకత్వం వహించాడు. హరీశ్ కల్యాణ్ - ఇవానా జంటగా నటించిన ఈ సినిమాలో, నదియా ఒక కీలకమైన పాత్రను పోషించారు. ఆగస్టు 4వ తేదీన ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. 

ఈ నేపథ్యంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ కి సాక్షి సింగ్ ధోనితో పాటు, ప్రధానమైన పాత్రధారులు హాజరయ్యారు. ఈ బ్యానర్లో నిర్మితమైన తొలి సినిమా తనదే కావడాన్ని అదృష్టంగా భావిస్తున్నానని ఇవాన చెప్పింది. ఈ రోజు తనకి చాలా స్పెషల్ అంటూ హర్షాన్ని వ్యక్తం చేసింది. చాలా రోజుల తరువాత హైదరాబాద్ రావడం ఆనందంగా ఉందంటూ నదియా మాట్లాడారు. 

ఇక హరీశ్ కల్యాణ్ తెలుగులో మాట్లాడి అందరినీ ఆశ్చర్యపరిచాడు. తెలుగు సినిమాలను ఫాలో అవుతూ ఉంటాననీ, ఎన్టీఆర్ .. మహేశ్ బాబు .. అల్లు అర్జున్ అంటే తనకి ఎక్కువ ఇష్టమని చెప్పాడు. సాక్షి సింగ్ ధోని మాట్లాడుతూ, ఎంటర్టయిన్ మెంట్ వరల్డ్ పట్ల ప్రతి ఒక్కరికీ ఆసక్తి ఉంటుందని అన్నారు. టీవీ .. ఓటీటీ .. సినిమా .. ఇలా ఫ్లాట్ ఫామ్ ఏదైనా, అందరూ కోరుకునేది ఎంటర్టయిన్ మెంట్ అని చెప్పారు. వినోద ప్రపంచం పట్ల ఉన్న ఆసక్తితోనే తాను సినిమాల నిర్మాణం దిశగా వచ్చానని ఆమె స్పష్టం చేశారు. 

Sakshi Singh Dhoni
Harish Kalyan
Ivana
Nadhia
LGM

More Telugu News