Bandi Sanjay: అమిత్ షాతో బండి సంజయ్ భేటీ.. పార్టీ పదవి నుంచి దిగిపోయిన తర్వాత తొలిసారి!

bandi sanjay meet amit shah in delhi
  • పార్లమెంటులో కేంద్ర మంత్రి కార్యాలయంలో   భేటీ
  • తెలంగాణ రాజకీయాలపై చర్చించుకున్న నేతలు
  • తనను సంజయ్ కలిసిన విషయాన్ని ట్వీట్ చేసిన అమిత్ షా

బీజేపీ అగ్ర నేత, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ భేటీ అయ్యారు. సోమవారం పార్లమెంటులోని హోం మంత్రి కార్యాలయంలో వీరిద్దరూ భేటీ అయ్యారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్ష పదవి నుంచి బండి సంజయ్ దిగిపోయిన తర్వాత అమిత్ షాను బండి సంజయ్ కలవడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.


దీంతో ఈ భేటీపై ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ భేటీలో రాష్ట్ర రాజకీయాలపై ఇరువురు చర్చించుకున్నట్లుగా తెలుస్తోంది. బండి సంజయ్ తనను కలిసిన విషయాన్ని అమిత్ షా ట్వీట్ చేశారు. తెలంగాణకు సంబంధించిన పలు అంశాలపై చర్చించినట్లు వెల్లడించారు.

  • Loading...

More Telugu News