Nithin: పుకార్లకు ఫుల్ స్టాప్ పెట్టేసిన నితిన్!

Extra Movie Update
  • నితిన్ హీరోగా రూపొందుతున్న 'ఎక్స్ ట్రా'
  • సినిమాల్లో జూనియర్ ఆర్టిస్టుగా కనిపించనున్న హీరో 
  • ఆయన జోడీకడుతున్న శ్రీలీల
  • బాణీలను కడుతున్న హారీస్ జైరాజ్ 
  • డిసెంబర్ 23వ తేదీన సినిమా విడుదల
నితిన్ తాజా చిత్రంగా 'ఎక్స్ ట్రా ఆర్డినరీ మేన్' రూపొందుతోంది. నితిన్ సొంత బ్యానర్లో నిర్మితమవుతున్న ఈ సినిమాకి, వక్కంతం వంశీ దర్శకత్వం వహిస్తున్నాడు. నితిన్ ను డిఫరెంట్ లుక్ తో ఆయన చూపించనున్నాడు. నితిన్ జోడీగా ఈ సినిమాలో శ్రీలీల కనిపించనుంది. ఈ జోడీని తెరపై చూడటానికి యూత్ ఉత్సాహాన్ని చూపిస్తోంది. 

ఈ కథలో నితిన్ సినిమాల్లో జూనియర్ ఆర్టిస్టుగా నటిస్తుంటాడు. అందువలన ముందుగా 'జూనియర్' అనే టైటిల్ ను అనుకున్నారు. కానీ టైటిల్ లో వెయిట్ లేనట్టుగా అనిపించి, 'ఎక్స్ ట్రా' అనే టైటిల్ ను సెట్ చేసి, దాని కొనసాగింపుగా 'ఆర్డినరీ మేన్' అంటూ ఆలోచనలో పడేశారు. 

నిజానికి ఈ ప్రాజెక్టు మధ్యలోనే ఆగిపోయినట్టుగా ఆ మధ్య వార్తలు వచ్చాయి. సెకండాఫ్ స్క్రిప్ట్ పెర్ఫెక్ట్ గా రాకపోవడమేననే టాక్ వినిపించింది. ఆ సందేహాలకు నితిన్ తెరదించేశాడు. డిసెంబర్ 23వ తేదీన ఈ సినిమాను విడుదల చేస్తున్నట్టుగా నిన్న ప్రకటించారు. హారీస్ జైరాజ్ ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నాడు. 

Nithin
Sreeleela
Vakkantham Vamsi
Extra Movie

More Telugu News