Jagan: జగన్ పర్యటన.. నల్ల బెలూన్లతో అమరావతి రైతుల నిరసన

Amaravati farmers protest against Jagan with black baloons
  • ఆర్ 5 జోన్ లో ఇళ్ల నిర్మాణాలకు శంకుస్థాపన చేసిన జగన్
  • శిబిరాల వద్ద నిరసన చేపట్టిన అమరావతి రైతులు
  • ఆర్ 5 జోన్ పై హైకోర్టులో తీర్పు రిజర్వ్ లో ఉన్నప్పటికీ జగన్ ముందుకు వెళ్తున్నారని మండిపాటు
అమరావతి ప్రాతంలోని ఆర్ 5 జోన్ లో పేదలకు కేటాయించిన ఇంటి స్థలాల్లో ఇళ్ల నిర్మాణాలకు ముఖ్యమంత్రి జగన్ శంకుస్థాపన చేశారు. మరోవైపు అమరావతి రైతులు కృష్ణాయపాలెం, తుళ్లూరు, వెంకటపాలెం శిబిరాల వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఆర్ 5 జోన్ పై హైకోర్టులో తీర్పు రిజర్వ్ లో ఉన్నప్పటికీ... ఆ ప్రాంతంలో ఇళ్ల నిర్మాణంపై ముందుకెళ్తున్నారని వారు విమర్శించారు. కోర్టులపై జగన్ కు గౌరవం లేదని దుయ్యబట్టారు. రాజధాని రైతులను కోర్టుల చుట్టూ తిప్పుతున్నారని, కావాలనే ఇబ్బంది పెడుతున్నారని అన్నారు. తమ సమాధులపై నుంచి ఎన్నికలకు వెళ్తున్నారని మండిపడ్డారు. నల్ల బెలూన్లతో నిరసన వ్యక్తం చేశారు. మరోవైపు అమరావతి రైతులు బయటకు రాకుండా పోలీసులు కట్టడి చేస్తున్నారు. 

Jagan
YSRCP
Amravati Farmers

More Telugu News