Hyderabad: ఫ్లైఓవర్ పైనుంచి పడి హైదరాబాదీ యువకుడి మృతి

One biker dead and other injured in accident in gachibowli
  • ఆదివారం రాత్రి గచ్చిబౌలి ఫ్లైఓవర్‌పై జరిగిన ప్రమాదం
  • బైక్‌పై వేగంగా వెళుతూ డివైడర్‌ను ఢీకొట్టిన యువకుడు
  • ఒకరు ఘటనాస్థలంలోనే మృతి, వెనక కూర్చున్న వ్యక్తికి ఆసుపత్రిలో చికిత్స
గచ్చిబౌలి ఫ్లైఓవర్‌ పైనుంచి పడి ఓ యువకుడు దుర్మరణం చెందిన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. రాత్రివేళ ఇద్దరు యువకులు వేగంగా టూవీలర్‌పై ప్రయాణిస్తూ డివైడర్‌ను ఢీకొట్టారు. దీంతో, ఒక ఫ్లైఓవర్ నుంచి మరో ఫ్లైవర్‌పై ఎగిరిపడ్డారు. 

ప్రమాద తీవ్రతకు మధు(25) అనే యువకుడు ఘటనా స్థలంలోనే మృతి చెందాడు. తీవ్రంగా గాయపడ్డ మరో యువకుడికి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. మధు గచ్చిబౌలిలో నివసిస్తుంటాడని పోలీసులు తెలిపారు. అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని తెలిపారు.
Hyderabad
Telangana
Road Accident

More Telugu News