Nara Lokesh: బాబాయిని చంపింది ఎవరో సీబీఐ చార్జిషీట్ తో తెలిసిపోయింది: నారా లోకేశ్

  • మార్కాపురం నియోజకవర్గంలో యువగళం
  • తలమళ్ల క్యాంప్ సైట్లో కొండపి క్యాడర్ తో లోకేశ్ సమావేశం
  • పొగాకు రైతులతో ముఖాముఖి
  • సంతనూతలపాడు నియోజకవర్గంలో ప్రవేశించిన పాదయాత్ర
Nara Lokesh Yuvagalam Padayatra details in Markapuram constituency

మూడు రోజుల పాటు మార్కాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో కొనసాగిన యువగళం పాదయాత్ర... ఆదివారం సంతనూతలపాడు నియోజకవర్గంలోకి ప్రవేశించింది. 163వ రోజు పాదయాత్ర మార్కాపురం నియోజకవర్గం తలమళ్ల నుంచి ప్రారంభం కాగా, మర్రిచెట్లపాలెం వద్ద సంతనూతలపాడు అసెంబ్లీ నియోజకవర్గంలోకి ప్రవేశించింది. మర్రిచెట్లపాలెం శివార్లలో సంతనూతలపాడు ఇన్ చార్జి విజయకుమార్, బాపట్ల మాజీ ఎంపీ శ్రీరాం మాల్యాద్రి, నేతృత్వంలో నాయకులు, కార్యకర్తలు లోకేశ్ కు ఘనస్వాగతం పలికారు. 

అంతకుముందు, తలమళ్ల క్యాంప్ సైట్ లో కొండపి నియోజకవర్గ పార్టీ నాయకులతో సమావేశమైన లోకేశ్, అనంతరం పొగాకు రైతులతో ముఖాముఖి సమావేశం నిర్వహించి వారి సాధకబాధకాలు తెలుసుకున్నారు.

కొండపి టీడీపీ క్యాడర్ తో లోకేశ్ సమావేశం హైలైట్స్...

9 నెలలు కష్టపడండి... గుండెల్లో పెట్టుకొని చూసుకుంటా!

నాలుగేళ్లలో చేసిన పోరాటం ఒకెత్తు... రాబోయే 9 నెలల్లో చేసే పోరాటం మరో ఎత్తు. 9 నెలలు కష్టపడండి, మిమ్మల్ని నా గుండెల్లో పెట్టుకుని చూసుకుంటా. దొంగ కేసులు పెట్టేందుకు 420 బ్యాచ్ సిద్ధంగా ఉంది, అప్రమత్తంగా ఉండాలి. 

టీడీపీ కార్యకర్తలను ఆర్థికంగా, అక్రమ కేసులతో జగన్ ఇబ్బంది పెట్టారు. కేసు పెడితే భయపడతారని అనుకుంటున్నారు. మీరు పోరాడండి... మీకు అండగా నేనుంటా. ఒక కరుడుగట్టిన నేరస్తుడు, సొంత బాబాయిని చంపిన క్రిమినల్ తో యుద్ధం చేస్తున్నాం. 

బాబాయిని ఎవరు చంపారో సీబీఐ తాజా ఛార్జ్ షీట్ తో తెలిసిపోయింది. గతంలో నారాసుర రక్త చరిత్ర అనే తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టలేకపోయాం. 

అందరినీ గౌరవిస్తా... పనిచేసే వాళ్లను ప్రోత్సహిస్తా!

సీనియర్లు, జూనియర్లను గౌరవిస్తా... పనిచేసేవాళ్లను ప్రోత్సహిస్తా, కలసికట్టుగా పనిచేయండి. గత ఎన్నికల్లో ఉమ్మడి ప్రకాశం జిల్లా టీడీపీ గౌరవాన్ని నిలబెట్టింది. వైజాగ్ తో పోటీపడి ఇక్కడి ప్రజలు నాలుగు సీట్లు ఇచ్చారు. 

కొండపి ప్రజలు టీడీపీని దీవించి గెలిపించారు. మీరు మాపై పెట్టుకున్న నమ్మకాన్ని వృథా చేయం. కొండపి ప్రాంతాన్ని నా గుండెల్లో పెట్టుకుని అభివృద్ధి చేసే బాధ్యత నేను తీసుకుంటా. ఇప్పుడున్న పరిస్థితుల్లో కష్టపడి పని చేస్తే 175 నియోజకవర్గాల్లోనూ విజయం సాధిస్తాం. 

యూనిట్, క్లస్టర్, బూత్ వారీగా ప్రతి ఒక్కరూ పని చేయాలి. ప్రజల్లో జగన్ ప్రభుత్వంపై తీవ్రమైన వ్యతిరేకత ఉంది. ఈ సమయంలో ప్రజలకు భరోసా ఇస్తే మన వెంట నడుస్తారు. టీడీపీ వచ్చిన వెంటనే భవిష్యత్ కు గ్యారంటీ సంక్షేమ పథకాలు అమలు చేస్తాం. 

సత్య భవిష్యత్ నాకు వదిలేయండి!

2024లో కొండపిలో హ్యాట్రిక్ విజయం సాధించబోతున్నాం. భారీ మెజారిటీపై ఫోకస్ చేయాలి. కార్యకర్తలు ప్రతి ఇంటి తలుపుతట్టి వారికి అండగా నిలవండి. 2019కు ముందు గ్రామాల్లో ప్రజల కోసం అభివృద్ధి పనులు చేశారు. కానీ ఆ పనులకు చెల్లించాల్సిన బిల్లులు జగన్ రెడ్డి నిలిపేశారు. టీడీపీ అధికారంలోకి రాగానే పనులు చేసిన వారికి ఈ ప్రభుత్వం పెట్టిన బకాయిలకు రూ.2 వడ్డీతో చెల్లిస్తాం. 

దామచర్ల సత్య నా తమ్ముడు లాంటి వాడు... సత్య రాజకీయ భవిష్యత్ నేను చూసుకుంటాను. కొండపి మోడల్ ను రాష్ట్రమంతా ఆదర్శంగా తీసుకునేలా పనిచేయాలి. కొండపి నియోజకవర్గంలో పాదయాత్రను విజయవంతం చేసిన నాయకులు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.

పొగాకు రైతులతో సమావేశంలో లోకేశ్ వ్యాఖ్యల హైలెట్స్

పొగాకుకు ఇన్సూరెన్స్ అంశాన్ని పరిశీలిస్తాం

టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే బ్యారన్ కు 50 క్వింటాళ్లు అమ్ముకోవడానికి బోర్డు అనుమతి ఇచ్చేలా కేంద్రంతో పోరాడతాం. ఎన్టీఆర్ గారు కందుకూరులో పొగాకు బోర్డు ఏర్పాటు చేశారు. పొగాకుకు రేటు లేకపోతే కిలోకి అదనంగా రూ.5 ఇచ్చి ఆదుకుంది చంద్రబాబునాయుడు. కానీ జగన్ వచ్చాక డ్రిప్ తో సహా రైతుల కోసం అమలు చేసిన అన్ని సంక్షేమ కార్యక్రమాలను రద్దు చేశాడు. 

టీడీపీ వస్తే... మొక్క దగ్గర నుండి మందుల వరకూ సేవలు అందించే విధంగా ప్రతి పంటకు రీసెర్చ్ సెంటర్లు ఏర్పాటు చేస్తాం. వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా వ్యవసాయ జోన్లు ఏర్పాటు చేసి రైతులకు సూచనలు ఇస్తాం. పొగాకులో ఎఫ్ డీఐలు రావాల్సిన అవసరం ఉంది, అప్పుడే రైతుకి మేలు జరుగుతుంది. 

పొగాకు రైతులు స్టాక్ పెట్టుకోడానికి రేకుల షెడ్డు నిర్మాణానికి సహాయం అందిస్తాం. పొగాకు కి ఇన్స్యూరెన్స్ కల్పించే అంశం పై నిపుణులతో చర్చించి నిర్ణయం తీసుకుంటాం.

లోకేశ్ ను కలిసిన గ్రానైట్ ఫ్యాక్టరీ ఓనర్స్ అసోసియేషన్ ప్రతినిధులు

సంతనూతలపాడు నియోజకవర్గం రామతీర్థంలో ప్రకాశం జిల్లా గ్రానైట్ ఓనర్స్ అసోసియేషన్ ప్రతినిధులు లోకేశ్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. నారా లోకేశ్ స్పందిస్తూ... కోట్లాది రూపాయల విదేశీ మారకద్రవ్యం ఆర్జించే గ్రానైట్ పరిశ్రమను జగన్ అనాలోచిత విధానాలతో తీవ్రంగా దెబ్బతీశారని విమర్శించారు. 

వైసీపీ అధికారంలోకి వచ్చాక గ్రానైట్ పరిశ్రమదారులపై కక్షగట్టినట్లుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. తమ పార్టీవారు తప్ప రాష్ట్రంలో మరెవరూ వ్యాపారం చేయకూడదన్నట్లుగా తప్పుడు విధానాలు అవలంభిస్తున్నారని మండిపడ్డారు. 

టీడీపీ అధికారంలోకి వచ్చాక పాత గ్రానైట్ పాలసీని తెచ్చి పరిశ్రమదారులకు చేయూతనిస్తామని లోకేశ్ హామీ ఇచ్చారు. ఎటువంటి వేధింపులు లేకుండా స్వేచ్చగా పరిశ్రమదారులు వ్యాపారం చేసుకునే అవకాశం కల్పిస్తామని, ముడిరాయి విషయంలో స్థానిక గ్రానైట్ ఫ్యాక్టరీలకు ప్రాధాన్యతనిచ్చేలా చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. గ్రానైట్ కార్మికుల వైద్యం కోసం ఈఎస్ఐ ఆసుపత్రి నిర్మాణం చేపడతామని మాటిచ్చారు.

*యువగళం పాదయాత్ర వివరాలు*

*ఇప్పటివరకు నడిచిన మొత్తం దూరం 2168.3 కి.మీ.*

*ఈరోజు నడిచిన దూరం 16.2 కి.మీ.*

*164వరోజు (24-7-2023) పాదయాత్ర వివరాలు*

*సంతనూతలపాడు అసెంబ్లీ నియోజకవర్గం (ప్రకాశం జిల్లా)*

సాయంత్రం

4.00 – చీమకుర్తి శివారు క్యాంప్ సైట్ నుంచి పాదయాత్ర ప్రారంభం.

4.15 – చీమకుర్తిలో స్థానికులతో మాటామంతీ.

4.45 – చీమకుర్తి ఎమ్మార్వో ఆఫీసు వద్ద బహిరంగసభ, లోకేశ్ ప్రసంగం.

6.15 – చీమకుర్తి నెహ్రూనగర్ లో చేనేతలతో సమావేశం.

7.15 – మంచికలపాడులో ఎస్సీ సామాజికవర్గీయులతో భేటీ.

9.15 – సంతనూతలపాడు శివారు విడిది కేంద్రంలో బస.

******

More Telugu News