Chandrababu: కుప్పంలో టీడీపీ అధినేత చంద్రబాబు ఇంటి నిర్మాణానికి తొలగిన అడ్డంకులు

Permissions granted for Chandrababu house construction in Kuppam constituency
  • కుప్పం... చంద్రబాబు సొంత నియోజకవర్గం
  • సొంత ఇల్లు లేదంటూ విమర్శలు
  • శాంతిపురం మండలంలో 99 సెంట్ల స్థలం కొనుగోలు చేసిన చంద్రబాబు
  • ఇంటి నిర్మాణం కోసం ఆర్నెల కిందట దరఖాస్తు
  • ఇన్నాళ్లకు అనుమతుల మంజూరు 
చిత్తూరు జిల్లా కుప్పంలో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు సొంత ఇంటి నిర్మాణానికి అడ్డంకులు తొలగిపోయాయి. చంద్రబాబు ఇంటి నిర్మాణానికి పీఎంకే హుడా అనుమతులు జారీ చేసింది. 

కుప్పం... చంద్రబాబు సొంత నియోజకవర్గం అని తెలిసిందే. కుప్పం నియోజకవర్గంలోని శాంతిపురం మండలం శివపురంలో చంద్రబాబు ఇల్లు నిర్మించుకుంటున్నారు. అందుకోసం ఆయన జాతీయ రహదారిని ఆనుకుని 99.77 సెంట్ల భూమిని కొనుగోలు చేశారు. 

ఇందులో గృహ నిర్మాణం జరుపుకునేందుకు అనుమతి ఇవ్వాలని ఆర్నెల కిందటే దరఖాస్తు చేసుకున్నారు. ఇన్నాళ్లకు ఆయనకు అనుమతులు మంజూరయ్యాయి. సొంత నియోజకవర్గంలో సొంత ఇల్లు లేదన్న విమర్శలకు చంద్రబాబు ఇక చెక్ పెట్టనున్నారు.
Chandrababu
House Construction
Permission
Kuppam
TDP
Chittoor District

More Telugu News