nara rohit: నారా రోహిత్ రీఎంట్రీ.. ప్రతినిధికి సీక్వెల్!

Hero Rohith Nara to come back with Prathinidhi Movie sequel
  • మాజీ సీఎం చంద్రబాబు కుటుంబం నుంచి ఇండస్ట్రీలోకి వచ్చిన నటుడు
  • ఇప్పటికే 18 సినిమాల్లో నటించిన రోహిత్
  • మధ్యలో కొంత విరామం తీసుకున్న హీరో
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలకంగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు కుటుంబం వచ్చిన తొలి హీరో నారా రోహిత్. కెరీర్ ఆరంభంలోనే బాణం, సోలో చిత్రాలతో ఆకట్టుకున్నాడు. ప్రతినిధి, అప్పట్లో ఒకడుండేవాడు లాంటి కథాబలం ఉన్న సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్నాడు. కారణం తెలియదు గానీ తను కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉన్నాడు. ఇప్పుడు రీఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడు. తన తదుపరి సినిమా ఫస్ట్‌లుక్‌ని విడుదల చేయనున్నట్టు ట్విట్టర్ ద్వారా తెలిపాడు. ప్రీ లుక్‌ పోస్టర్‌ ద్వారా ఈ సినిమా గురించి హిట్ ఇచ్చాడు.

వార్త పత్రికల క్లిప్పింగ్స్‌ ఉన్న చేతితో కూడిన పోస్టర్ లో ‘ఒక వ్యక్తి అన్ని అసమానతలకు వ్యతిరేకంగా మళ్లీ నిలబడతాడు’ అనే ట్యాగ్ లైన్ ఇచ్చాడు. పైన రెండో నంబర్ ఉంది. దీన్ని బట్టి తన కెరీర్‌‌లో గుర్తుండిపోయిన ప్రతినిధికి సీక్వెల్ అనిపిస్తోంది. ఇది రోహిత్ నటిస్తున్న 19వ సినిమా. ఈ చిత్రాన్ని వానర ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ నిర్మించనుంది. దర్శకుడు, హీరోయిన్, ఇతర నటులు, సాంకేతిక నిపుణుల వివరాలు తెలియాల్సి ఉంది.
nara rohit
Tollywood
Andhra Pradesh
Chandrababu

More Telugu News