Road Accident: అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం... ఐదుగురి మృతి

Six dead in accident in Annamayya district
  • పుల్లంపేట సమీపంలోని క్రాస్ వద్ద జాతీయ రహదారిపై ప్రమాదం
  • కడప నుండి తిరుపతి వెళ్తున్న బస్సును ఢీకొట్టిన లారీ
  • ఈ ప్రమాదంలో 10 మందికి గాయాలు
అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. ఓ ఆర్టీసీ బస్సు కడప నుండి తిరుపతి వెళ్తుండగా లారీ ఢీకొట్టింది. దీంతో ముగ్గురు అక్కడికి అక్కడే మృతి చెందగా, మరో ఇద్దరు ఆసుపత్రిలో మరణించినట్టు తెలుస్తోంది. గాయపడిన వారిని రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పుల్లంపేట సమీపంలోని క్రాస్ వద్ద జాతీయ రహదారిపై కడప నుండి తిరుపతికి వెళ్తున్న ఆర్టీసీ బస్సును ఎదురుగా వచ్చిన లారీ ఢీకొట్టింది.

దీంతో ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న వారు ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదానికి లారీ డ్రైవర్ అతివేగమే కారణమని స్థానికులు, పోలీసులు తెలిపారు.
Road Accident
Andhra Pradesh

More Telugu News