Andhra Pradesh: ఏపీలో ఘటన.. భర్తను చితకబాది, ప్రైవేట్ పార్టును కోసేసిన రెండో భార్య.. కారణం ఇదే!

Second wife cuts husbands private part in AP
  • తొలి భార్య ఇన్స్టాగ్రామ్ వీడియోలను చూస్తున్న భర్త
  • తనను పెళ్లి చేసుకుని ఆమె వీడియోలు ఎందుకు చూస్తున్నావంటూ రెండో భార్య ఆగ్రహం
  • బ్లేడ్ తీసుకుని మర్మాంగాన్ని కోసేసిన వైనం

ఎన్టీఆర్ జిల్లా నందిగామలో అందరూ ఉలిక్కి పడే ఘటన చోటుచేసుకుంది. మొదటి భార్య ఇన్స్టాగ్రామ్ రీల్స్ ను చూస్తున్న భర్త మర్మాంగాన్ని రెండో భార్య కోసేసింది. స్థానికంగా తీవ్ర కలకలం రేపిన ఈ ఘటన నందిగామలోని అయ్యప్ప నగర్ లో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే, ముప్పాళ్ల గ్రామానికి చెందిన కోట ఆనంద్ బాబు తొలుత ఒక మహిళను పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత మనస్పర్థల కారణంగా ఇద్దరూ విడిపోయారు. అనంతరం ఐదేళ్ల క్రితం వరమ్మ అనే మహిళను రెండో వివాహం చేసుకున్నాడు. 

నిన్న రాత్రి ఇంటికి వచ్చిన ఆనంద్ బాబు... తన మొదటి భార్యకు చెందిన ఇన్స్టాగ్రామ్ వీడియోలను చూస్తుండటాన్ని వరమ్మ గమనించింది. ఆమెలో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. తనను పెళ్లి చేసుకున్న తర్వాత ఆమె వీడియోలు ఎందుకు చూస్తున్నావని ప్రశ్నించింది. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఇద్దరూ ఒకరినొకరు కొట్టుకున్నారు. ఈ క్రమంలో భర్తపై వరమ్మ బ్లేడ్ తో దాడి చేసింది. భర్త మర్మాంగాలను కోసేసింది. తీవ్ర రక్తస్రావం కావడంతో ఆయనను తొలుత నందిగామ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆ తర్వాత మెరుగైన వైద్యం కోసం విజయవాడకు తరలించారు.

  • Loading...

More Telugu News