Foreign Currency: విమానాశ్రయంలో కట్టల కొద్దీ విదేశీ కరెన్సీ.. కస్టమ్స్ చరిత్రలోనే తొలిసారి భారీగా స్వాధీనం!

Foreign Currency Worth 10 Crore Customs Biggest Ever Seizure So Far
  • ఢిల్లీలోని ఐజీఐ విమానాశ్రయంలో రూ.10 కోట్ల విదేశీ కరెన్సీ పట్టివేత
  • లగేజీలో ఉంచిన బూట్లలో దాచిన నిందితులు
  • ఇస్తాంబుల్‌కు వెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా పట్టుకున్న అధికారులు
ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు భారీగా విదేశీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. కస్టమ్స్‌ చరిత్రలోనే తొలిసారిగా రూ.10 కోట్ల విలువైన విదేశీ నోట్లను పట్టుకున్నారు. ఈ సందర్భంగా ముగ్గురు తజికిస్థాన్ జాతీయులను అదుపులోకి తీసుకున్నారు.

లగేజీలో ఉంచిన బూట్లలో విదేశీ కరెన్సీని దాచి ఉంచినట్లు సమాచారం. నిందితులు ఇస్తాంబుల్‌కు విమానం ఎక్కేందుకు వెళ్తుండగా అధికారులు అడ్డుకున్నారు. వారి బ్యాగేజీని చెక్ చేయగా.. కట్టల కొద్దీ నోట్లు బయటపడ్డాయి. వాటిని లెక్కించగా.. రూ.10.6 కోట్లు (7.20 లక్షల డాలర్లు లేదా 4. 66 లక్షల యూరోలు) ఉన్నట్లు గుర్తించారు. ఈ మేరకు కస్టమ్స్ శాఖ ఓ ప్రకటనను విడుదల చేసింది. విదేశీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నామని, విచారణ జరుగుతోందని చెప్పింది.

కస్టమ్స్ డిపార్ట్‌మెంట్ ప్రకారం.. భారతదేశంలోని ఓ విమానాశ్రయంలో తొలిసారిగా ఇంత పెద్ద మొత్తంలో విదేశీ కరెన్సీని అక్రమంగా తరలిస్తుండగా పట్టుకున్నారు. అధికారులు అదుపులోకి తీసుకున్న ముగ్గురిలో ఓ మైనర్ కూడా ఉన్నాడని కస్టమ్స్ అధికారులు తెలిపారు.
Foreign Currency
Indira Gandhi International airport
Customs officials
Tajikistan nationals
Biggest Ever Seizure

More Telugu News