Tamannaah: చిరంజీవి సినిమాకి డబ్బింగ్ పూర్తి చేసిన తమన్నా

Tamannaah completes dubbing for Chiranjeevi starred Bhola Shankar
  • మెహర్ రమేశ్ దర్శకత్వంలో భోళాశంకర్
  • చిరంజీవి సరసన హీరోయిన్ గా తమన్నా
  • తమన్నా డబ్బింగ్ చెప్పడం పూర్తయిందన్న మెహర్ రమేశ్
  • వినోదాల విందు ఖాయమని ధీమా
మెగాస్టార్ చిరంజీవి, తమన్నా జంటగా తెరకెక్కుతున్న భోళాశంకర్ విడుదలకు సన్నద్ధమవుతోంది. ఈ చిత్రంలో తన పాత్ర కోసం తమన్నా డబ్బింగ్ పూర్తి చేసుకుంది. దర్శకుడు మెహర్ రమేశ్ ఈ మేరకు అప్ డేట్ ఇచ్చారు. మా మిల్కీ బ్యూటీ తమన్నా భోళాశంకర్ కోసం డబ్బింగ్ చెప్పడం పూర్తయింది అని వెల్లడించారు. 

ఈ చిత్రంలో చిరంజీవితో తమన్నా సన్నివేశాలు వినోదాత్మకంగా ఉంటాయని, తమన్నా గ్లామరస్ గా మెరిసిపోయిందని వివరించారు. చిరంజీవి, తమన్నా, కీర్తి సురేశ్, సుశాంత్, బ్రహ్మానందం, హైపర్ ఆది తదితరులు నటించిన భోళాశంకర్ తో నవ్వుల విందు ఖాయమని మెహర్ రమేశ్ ధీమా వ్యక్తం చేశారు. 

ఏకే ఎంటర్టయిన్ మెంట్స్ బ్యానర్ పై రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రానికి మహతి స్వరసాగర్ సంగీత దర్శకుడు. ఈ చిత్రం నుంచి నిన్న విడుదలైన 'మిల్కీ బ్యూటీ' పాటకు విశేష స్పందన లభిస్తోంది.
Tamannaah
Dubbing
Bhola Shankar
Meher Ramesh
AK Entertainments

More Telugu News