Balakrishna: 'భగవంత్ కేసరి' రిలీజ్ డేట్ ఖరారు .. ఆసక్తిని రేపుతున్న న్యూ పోస్టర్!

Bhagavanth Kesari Movie Release Date Confirmed
  • 'భగవంత్ కేసరి'గా బాలకృష్ణ
  • ముఖ్యమైన పాత్రల్లో కాజల్ - శ్రీలీల 
  • ఫ్యామిలీ ఎమోషన్స్ నేపథ్యంలో నడిచే కథ 
  • విలన్ గా తెలుగు తెరకి అర్జున్ రాంపాల్ పరిచయం 
  • అక్టోబర్ 19వ తేదీన విడుదల కానున్న సినిమా

బాలకృష్ణ కథానాయకుడిగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో 'భగవంత్ కేసరి' సినిమా రూపొందుతోంది. బలమైన కథాకథనాలతో ఈ సినిమాను సాహు గారపాటి - హరీశ్ పెద్ది నిర్మిస్తున్నారు. ఇది తండ్రీ కూతుళ్ల మధ్య ఉన్న బలమైన ఎమోషన్స్ తో .. బాలయ్య మార్కు యాక్షన్ ప్రధానంగా నడిచే కథ. బాలకృష్ణ కూతురి పాత్రలో శ్రీలీల కనిపించనుంది. 

ఇక బాలయ్య సరసన కథానాయిక పాత్రను కాజల్ పోషించింది. బాలయ్య సరసన నటించడం ఆమెకి ఇదే మొదటిసారి. అలాంటి ఈ సినిమా రిలీజ్ డేట్ ను ఖరారు చేసుకుంది. ఈ సినిమాను అక్టోబర్ 19వ తేదీన రిలీజ్ చేస్తున్నట్టు తాజాగా ప్రకటించారు. రిలీజ్ డేట్ తో కూడిన పోస్టర్ లో, భారీ గన్స్ తో కనిపిస్తున్న బాలయ్య యాక్షన్ లుక్ మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది.  

 ఈ సినిమాకి తమన్ సంగీతాన్ని అందించాడు. ఆయన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తుందని అంటున్నారు. మరో ముఖ్యమైన పాత్రలో ప్రియాంక జవాల్కర్ కనిపించనుండగా, ప్రతినాయకుడిగా అర్జున్ రాంపాల్ తెలుగు తెరకి పరిచయమవుతున్నాడు. ఈ దసరాకి ఈ సినిమా సంచలనానికి తెరతీస్తుందేమో చూడాలి.

  • Loading...

More Telugu News