Tollywood: అవకాశాలు తగ్గినా.. అందం తగ్గలేదు.. రకుల్‌ ప్రీత్ లేటెస్ట్ ఫొటోలు ఇవిగో!

Rakul preet new photo shoot
  • తెలుగులో చాన్నాళ్లు అగ్ర హీరోయిన్‌గా రకుల్
  • వరుస ఫ్లాప్స్ తో టాలీవుడ్‌కు దూరమైన నటి
  • బాలీవుడ్‌లోనూ పరాజయాల పలుకరింపే
తెలుగులో చాన్నాళ్లు అగ్ర హీరోయిన్‌గా వెలుగొందిన నటి రకుల్ ప్రీత్ సింగ్. ఓ చిన్న సినిమాతో టాలీవుడ్‌తోనే తెరంగేట్రం చేసిన ఆమె ‘వెంకటాద్రి ఎక్స్ప్రెస్’తో గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత ఆమెకు వరుస అవకాశాలు వచ్చాయి. మహేశ్ బాబు, ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్, రవితేజ, నాగార్జున తదితర టాప్ హీరోలందరితోనూ కలిసి పని చేసింది. కానీ, వరుస ఫెయిల్యూర్స్ రావడంతో ఆమెకు టాలీవుడ్‌లో అవకాశాలు సన్నగిల్లాయి. 

దాంతో, ఆమె ఇప్పుడు బాలీవుడ్‌పై దృష్టి పెట్టింది. అక్కడ కూడా ఆమెకు ఆశించిన ఫలితాలు రావడం లేదు. ప్రస్తుతం కమలహాసన్‌ హీరోగా వస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘ఇండియన్2’పై ఆమె చాలా ఆశలు పెట్టుకుంది. సినిమా అవకాశాల సంగతి ఎలా ఉన్నా ఆమె చాలా యాక్టివ్‌గా ఉంటోంది. వరుసగా ఫొటో షూట్స్ లో పాల్గొంటూ తన అందం ఏమాత్రం తగ్గలేదని చెబుతోంది. తాజాగా బ్లాక్, గ్రే లెహెంగాలో ఓ ఫొటో షూట్‌లో పాల్గొని పోజులు ఇచ్చింది.
.
Tollywood
Bollywood
Rakul Preet Singh

More Telugu News