అవిశ్వాస తీర్మానం నుంచి గట్టెక్కిన చత్తీస్ గఢ్ కాంగ్రెస్ ప్రభుత్వం
- కాంగ్రెస్ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ఇచ్చిన బీజేపీ
- తీర్మానంపై 13 గంటల పాటు జరిగిన చర్చ
- అర్ధరాత్రి ఒంటి గంటకు వాయిస్ ఓటింగ్ చేపట్టిన స్పీకర్
నిన్న మధ్యాహ్నం నుంచి అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానంపై చర్చ జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని, ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదంటూ బీజేపీ అవిశ్వాస తీర్మానాన్ని ఇచ్చింది. 109 పాయింట్లతో కూడిన ఛార్జ్ షీట్ ను సభలో ప్రవేశపెట్టింది. మరోవైపు బీజేపీ ఛార్జ్ షీట్ లో ఉన్న అంశాలు నిరాధారమైనవని ముఖ్యమంత్రి భూపేశ్ భగేల్ అన్నారు. సభలో ఛార్జ్ షీట్ ను తీసుకురావడం ద్వారా... తమ ప్రభుత్వం సాధించిన విషయాలను సభలో చెప్పుకునే అవకాశాన్ని బీజేపీ కల్పించిందని అన్నారు.