G. Kishan Reddy: తెలంగాణవాదంపై ఉక్కుపాదం మోపిన వారితో వేదిక పంచుకోలేక వచ్చేశాను: విజయశాంతి ట్వీట్

Vijayasanthi unhappy with Kiran Kumar Reddy in Telangana BJP office
  • కిషన్ రెడ్డి ప్రమాణ స్వీకారంలో తాను మధ్యలో రావడంపై విజయశాంతి ట్వీట్
  • కిషన్ రెడ్డికి అభినందనలు తెలిపి, వచ్చానని పేర్కొన్న రాములమ్మ
  • అలాంటి వారు అక్కడ ఉండటం నాకు అసౌకర్యం, అసాధ్యమని వ్యాఖ్య
బీజేపీ తెలంగాణ నాయకురాలు విజయశాంతి శుక్రవారం చేసిన ఓ ట్వీట్ చర్చనీయాంశంగా మారింది. కిషన్ రెడ్డి ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా తెలంగాణను వ్యతిరేకించిన వారితో తనకు వేదిక పంచుకోవడం ఇష్టంలేక మధ్యలో వచ్చేసినట్లు స్పష్టం చేశారు. అయితే తాను కిషన్ రెడ్డి ప్రమాణ స్వీకారం సందర్భంగా ఆయనకు అభినందనలు తెలిపానని చెప్పారు. కానీ తెలంగాణను ఉక్కుపాదంతో మోపినవారు అక్కడ ఉండటంతో తాను మధ్యలోనే వచ్చేసినట్లు పేర్కొన్నారు. 

ఈ మేరకు విజయశాంతి ట్వీట్ కూడా చేశారు.
'బీజేపీ అధ్యక్షులుగా కిషన్ రెడ్డి గారి ప్రమాణస్వీకార కార్యక్రమం మధ్యలో 
వచ్చేశానని పాత్రికేయ మిత్రులు అడుగుతున్నారు.
అది, సరి కాదు. 
కిషన్ రెడ్డి గారిని అభినందించి, శుభాశీస్సులు తెలియచేసిన తరువాతే వచ్చాను.
ఐతే, నాడు తెలంగాణను అత్యంత తీవ్రంగా వ్యతిరేకించి, తెలంగాణవాదాన్ని ఉక్కుపాదంతో అట్టడుగుకు అణిచివేయాలని ప్రయత్నించిన వారు ఎవ్వరైనా ఉన్న సందర్భంలో, అక్కడ ఉండటం నాకు అసౌకర్యం, అసాధ్యం. 
ఆ పరిస్థితి వల్ల ముందుగానే వెళ్లవలసి వచ్చింది..
జై శ్రీరామ్
హర హర మహాదేవ' అని ట్వీట్ చేశారు.
G. Kishan Reddy
Vijayashanti
kiran kumar reddy
BJP

More Telugu News