Sireesha: మావోయిస్టు అగ్రనేత ఆర్కే భార్య శిరీషను అదుపులోకి తీసుకున్న ఎన్ఐఏ!

NIA has reportedly taken Maoist leader RK wife Sireesha into custody
  • రెండేళ్ల కిందట ఆర్కే కన్నుమూత
  • ప్రకాశం జిల్లాలో ఉంటున్న శిరీష
  • ఆలకూరపాడుకు మఫ్టీలో వచ్చిన పోలీసులు
  • పోలీసులను అడ్డుకునే ప్రయత్నం చేసిన శిరీష కుటుంబ సభ్యులు
  • వారిని నెట్టివేసి శిరీషను తీసుకెళ్లిన పోలీసులు!
మావోయిస్టు అగ్రనేత ఆర్కే రెండేళ్ల కిందట కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆయన భార్య శిరీష కూడా గతంలో నక్సల్ ఉద్యమంలో పనిచేశారు. ఉద్యమంలో ఉన్నప్పుడే ఇరువురు పెళ్లి చేసుకున్నారు. ఉద్యమం నుంచి బయటికి వచ్చిన శిరీష ప్రకాశం జిల్లాలో ఉంటున్నారు. 

కాగా, ఆర్కే భార్య శిరీషను నేడు ఎన్ఐఏ అదుపులోకి తీసుకుంది. ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం ఆలకూరపాడుకు పోలీసులు మఫ్టీలో వచ్చారు. పోలీసులు, ప్రత్యేక బలగాలు మూడు కార్లలో వచ్చి శిరీషను తీసుకెళ్లడం చర్చనీయాంశం అయింది. 

ఆమెను బలవంతంగా కారులో ఎక్కించుకుని తీసుకెళ్లినట్టు తెలుస్తోంది. కుటుంబ సభ్యులు అడ్డుపడినప్పటికీ పోలీసులు వారిని పక్కకి నెట్టివేసినట్టు సమాచారం. ఆర్కే భార్య శిరీష నివాసంలో ఎన్ఐఏ, ఇతర దర్యాప్తు సంస్థలు ఇప్పటికే పలుమార్లు సోదాలు జరిపాయి.
Sireesha
RK
Maoist
Police
Prakasam District
Andhra Pradesh

More Telugu News