Amitabh – Kamal: ‘నువ్వు మరీ అలా ఉండకు’.. కమల్ తో అమితాబ్ సరదా సంభాషణ

amitabh on kamal haasan says he is greater than all of them
  • ‘కామిక్ కాన్‌’ ఈవెంట్‌లో ‘కల్కి 2898 ఏడీ’ గ్లింప్స్‌ రిలీజ్ 
  • ఈ వేడుకలో వర్చువల్‌గా పాల్గొన్న అమితాబ్ బచ్చన్‌
  • కమల్ తమ అందరికంటే చాలా గొప్ప వ్యక్తి అంటూ అమితాబ్ ప్రశంసలు

అమెరికాలో ప్రతిష్ఠాత్మకమైన ‘శాన్‌ డియాగో కామిక్ కాన్‌’ ఈవెంట్‌లో ‘కల్కి 2898 ఏడీ’ గ్లింప్స్‌ను రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఈ వేడుకకు దర్శకుడు నాగ్ అశ్విన్, హీరోలు ప్రభాస్, కమలహాసన్, రానా, నిర్మాత అశ్వనీ దత్ తదితరులు హాజరయ్యారు. ఈ లాంచింగ్ ఈవెంట్‌లో అమితాబ్ బచ్చన్‌ వర్చువల్‌గా పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా కమలహాసన్ మాట్లాడుతూ.. అమితాబ్ బచ్చన్‌పై ప్రశంసలు కురిపించారు. ‘‘అమితాబ్ బచ్చన్ ఉన్న సమయంలోనే మేమంతా జీవిస్తుండటం గొప్ప గౌరవంగా ఉంది” అని కమల్ చెబుతుండగానే.. అమితాబ్ జోక్యం చేసుకున్నారు. ‘‘నువ్వు మరీ అంత నిరాడంబరుడిగా ఉండకు కమల్. మా అందరి కంటే నువ్వు చాలా గొప్పోడివి” అని చెప్పారు. దీంతో అందరూ నవ్వేశారు.

‘‘ఆయన ప్రతి సినిమా రియాల్టీతో కూడుకొని ఉంటుంది. ప్రతి సినిమాలో చాలా ఎఫర్ట్ పెడతారు. ఆయన పోషించిన పాత్రలు అద్భుతం. మేం ఇంతకుముందు కూడా రెండు సినిమాల్లో చేశాం.. కానీ ఇది చాలా స్పెషల్” అని కమలహాసన్‌పై బిగ్ బీ ప్రశంసలు కురిపించారు. 

కమల్ స్పందిస్తూ.. ‘‘షోలే సినిమాకు నేను అసిస్టెంట్ డైరెక్టర్ గా ఉన్నాను. ఆ సినిమా చూసిన రాత్రి నేను అసలు నిద్రపోలేదు. ఎందుకంటే ఆ సినిమాను చాలా ద్వేషించాను. ఆ సినిమా తీసిన వ్యక్తిని మరింత ద్వేషించాను. ఓ గొప్ప ఫిల్మ్ మేకర్ తో కలిసి పని చేసే అవకాశం నాకు వచ్చింది. అమిత్ జీ అలాంటి ఎన్నో సినిమాలు చేశాడు. నా సినిమాల గురించి ఆయన ఇంత గొప్పగా చెబుతారని ఎప్పుడూ ఊహించలేదు’’ అని చెప్పారు.

  • Loading...

More Telugu News