Allu Arjun: ‘బేబీ’ ఈవెంట్‌లో అభిమానులకు అల్లు అర్జున్ ఊహించని సర్‌ప్రైజ్

  • హైదరాబాద్‌లో జరిగిన బేబీ మూవీ అప్రిసియేషన్ ఈవెంట్
  • ముఖ్యఅతిథిగా హాజరైన అల్లు అర్జున్
  • పుష్ప-2 డైలాగ్ చెప్పమని అభిమానుల అభ్యర్థన
  • అల్లు అర్జున్ చెప్పిన పంచ్ డైలాగ్‌తో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ 
Allu arjun reveals puspha 2 punch dialogue in baby appreciation event in hyderabad

పుష్ప మూవీలో తగ్గేదే లే పంచ్ డైలాగ్ అభిమానులను ఎంతగా అలరించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఆ మూవీ సీక్వెల్ పుష్ప-2లో హీరో అల్లు అర్జున్ ఏ పంచ్ డైలాగ్ చెప్పబోతున్నారో అనే ఉత్కంఠ అభిమానుల్లో నెలకొంది. ఈ దిశగా అల్లు అర్జున్ అభిమానులకు ఊహించని సర్‌ప్రైజ్ ఇచ్చారు. 

ఆనంద్ దేవరకొండ హీరోగా దర్శకుడు సాయి రాజేశ్ తెరకెక్కించిన బేబీ ఇటీవల విడుదలై ప్రేక్షకాదరణ పొందుతోంది. దీంతో, ఈ మూవీ మేకర్స్ హైదరాబాద్‌లో అప్రిసియేషన్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హీరో అల్లు అర్జున్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. బేబీ మూవీ చాలా బాగుందని ప్రశంసించిన ఆయన చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. చివర్లో అభిమానులు పుష్ప-2 డైలాగ్ కావాలని కోరగా ఆయన ఓ పంచ్ డైలాగ్ వినిపించారు. ‘‘ఈడంతా జరిగేది ఒకటే రూల్ మీద జరుగుతాండాది..పుష్పా గాడి రూల్’’ అని అల్లు అర్జున్ అనడంతో అభిమానుల సంబరం ఆకాశాన్నంటింది. ఇక్కడ పుష్ఫ-2 డైలాగ్ చెబుతానని తాను అస్సలు అనుకోలేదని అల్లు అర్జున్ చెప్పారు. ఈ డైలాగ్‌ ప్రస్తుతం అభిమానుల్లో సంచలనం రేకెత్తిస్తోంది.

More Telugu News