Upasana: అభిమానులతో కలిసి పుట్టినరోజు వేడుకలు జరుపుకున్న ఉపాసన... ఫొటోలు ఇవిగో!

Upasana celebrates her birthday with fans in ITC Hotel
  • ఇటీవల తల్లి అయిన రామ్ చరణ్ అర్ధాంగి ఉపాసన
  • నేడు ఉపాసన పుట్టినరోజు
  • తల్లి అయిన తర్వాత తొలి బర్త్ డే ఇదే!
  • హైదరాబాద్ ఐటీసీ హోటల్లో అభిమానులను కలుసుకున్న ఉపాసన
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అర్ధాంగి ఉపాసన కొణిదెల నేడు (జులై 20) పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈసారి ఆమె అభిమానుల మధ్య పుట్టినరోజు జరుపుకోవడం విశేషం. హైదరాబాదులోని ఐటీసీ హోటల్లో ఉపాసన అభిమానులను కలుసుకున్నారు. వారు ఉత్సాహంతో కేరింతలు కొడుతుండగా కేక్ కట్ చేసి మురిసిపోయారు. 

ఈ సందర్భంగా అభిమానులు ఉపాసనకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపగా, ఆమె వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. అందరితో ఫొటోలకు పోజులిస్తూ, ఉపాసన ఉల్లాసంగా గడిపారు. దీనికి సంబంధించిన ఫొటోలు ఆకట్టుకుంటున్నాయి. 

ఇటీవలే బిడ్డకు జన్మనిచ్చిన ఉపాసన... తల్లి అయిన తర్వాత చేసుకుంటున్న తొలి పుట్టినరోజు ఇదే. ఇలా అభిమానుల మధ్య జన్మదిన వేడుకలు చేసుకోవడాన్ని ఆమె ఎంతగానో ఆస్వాదించారు.
Upasana
Birthday
Fans
ITC
Hyderabad
Ram Charan
Global Star
Tollywood

More Telugu News