Ambati Rambabu: డయాఫ్రం వాల్ కు మరమ్మతులు చేయాలా? లేక కొత్తది నిర్మించాలా? అనేది నిర్ణయిస్తాం: అంబటి రాంబాబు

Ambati comments on Polavaram project Diaphragm wall
  • పోలవరం స్పిల్ వే నుంచి 5 లక్షల క్యూసెక్కుల నీరు వెళ్తోందన్న అంబటి
  • డయాఫ్రం వాల్ పై కేంద్ర జల సంఘానికి నివేదిక ఇస్తామని వెల్లడి
  • పట్టిసీమ నుంచి కృష్ణా డెల్టాకు నీరు  అందించాలని నిర్ణయించామన్న మంత్రి

ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరి నదికి వరద పోటెత్తుతోంది. పోలవరం ప్రాజెక్టుకు భారీగా వరద చేరుకుంటోంది. ఈ సందర్భంగా ఏపీ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడుతూ... పోలవరం స్పిల్ వే నుంచి 5 లక్షల క్యూసెక్కుల నీరు వెళ్తోందని చెప్పారు. ఇది 8 లక్షల క్యూసెక్కులకు పెరిగే అవకాశం ఉందని తెలిపారు. 

డయాఫ్రం వాల్ కొన్ని చోట్ల దెబ్బతిన్నదని... దానికి మరమ్మతులు చేయాలా? లేక కొత్తది నిర్మించాలా? అనేది త్వరలో నిర్ణయిస్తామని, దీనిపై కేంద్ర జల సంఘానికి నివేదిక ఇస్తామని చెప్పారు. పట్టిసీమ నుంచి కృష్ణా డెల్టాకు నీరు అందించాలని నిర్ణయించామని... నాలుగేళ్ల తర్వాత పట్టిసీమకు నీరు ఇవ్వక తప్పని పరిస్థితి తలెత్తిందని అన్నారు. భవిష్యత్తు అవసరాల కోసం పులిచింతలలో నీరు నిల్వ ఉంచుతున్నామని చెప్పారు.

  • Loading...

More Telugu News