Harish Rao: మైనారిటీలకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్!

minister harish rao says good news to telangana minorities
  • పేద మైనార్టీల‌కు రూ.ల‌క్ష సాయం అంద‌జేస్తామన్న హరీశ్ రావు

  • బ్యాంకుల‌తో సంబంధం లేకుండానే లబ్ధిదారులకు ఇస్తామని ప్రకటన

  • రెండు, మూడు రోజుల్లో ఉత్త‌ర్వులిస్తామ‌ని వెల్లడి

తెలంగాణ‌లోని మైనార్టీల‌కు మంత్రి హ‌రీశ్‌రావు శుభ‌వార్త చెప్పారు. రాష్ట్రంలోని పేద మైనార్టీల‌కు ప్ర‌భుత్వం రూ.ల‌క్ష ఆర్థిక సాయం అంద‌జేస్తుంద‌ని ప్ర‌క‌టించారు. బ్యాంకుల‌తో సంబంధం లేకుండానే ఈ ఆర్థిక సాయం చేస్తామ‌ని ఆయన వెల్లడించారు. ప‌లు మైనార్టీ కార్పొరేష‌న్ల‌కు చైర్మ‌న్లుగా నియ‌మితులైన వారిని మంత్రులు హ‌రీశ్‌రావు, మ‌హ‌ముద్ అలీ స‌న్మానించారు.

ఈ సంద‌ర్భంగా హ‌రీశ్‌ మాట్లాడుతూ.. మైనార్టీల‌కు ఆర్థిక సాయంపై ఇప్ప‌టికే సీఎం కేసీఆర్ ఆదేశాలు ఇచ్చార‌ని తెలిపారు. మైనార్టీల‌కు సాయం అందించే కార్య‌క్ర‌మంపై రెండు, మూడు రోజుల్లో ఉత్త‌ర్వులు జారీ చేస్తామ‌ని వెల్లడించారు. ‘‘మైనార్టీలను సీఎం కేసీఆర్ ఎంతో గౌరవిస్తారు. రెండు పర్యాయాలు మహమూద్ అలీని మంత్రిగా చేశారు. హిందూవుల‌కు క‌ల్యాణ‌లక్ష్మి అమ‌లు చేసిన‌ట్లు.. మైనార్టీల కోసం షాదీ ముబార‌క్ అమ‌లు చేస్తున్నారు” అని వివరించారు. 


Harish Rao
minorities
good news to minorities
telangana
BRS

More Telugu News