Pawan Kalyan: ఢిల్లీ పర్యటన ముగించుకొని రాష్ట్రానికి చేరుకున్న పవన్ కల్యాణ్

Pawan Kalyan Delhi tour completed
  • మంగళగిరి పార్టీ కార్యాలయానికి జనసేనాని
  • ఢిల్లీలో బీజేపీ పెద్దలతో వరుస భేటీలు
  • అమిత్ షా, జేపీ నడ్డా తదితరులతో సమావేశం
జనసేన అధినేత పవన్ కల్యాణ్ మూడ్రోజుల ఢిల్లీ పర్యటనను ముగించుకొని గురువారం మధ్యాహ్నం గన్నవరం విమానాశ్రయం చేరుకున్నారు. కాసేపట్లో మంగళగిరిలోని పార్టీ కార్యాలయానికి చేరుకుంటారు. అక్కడ మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేశ్ బాబు పార్టీ చేరిక కార్యక్రమంలో పాల్గొంటారు. నాదెండ్ల మనోహర్ తో కలిసి పవన్ మూడ్రోజుల క్రితం ఢిల్లీకి వెళ్లారు. రెండు రోజుల క్రితం ఎన్డీయే సమావేశంలో పాల్గొన్నారు. ఆ తర్వాత బీజేపీ పెద్దలతో వరుసగా భేటీ అయ్యారు.

కేంద్ర హోంమంత్రి అమిత్ షా, వెంకయ్య నాయుడు తదితరులతో సమావేశమయ్యారు. అమిత్ షాతో దాదాపు పదిహేను నిమిషాలు చర్చించారు. ఈ రోజు ఉదయం బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో సమావేశమయ్యారు. నడ్డాతో గంటకు పైగా భేటీ అయ్యారు. ఈ మేరకు జనసేన పత్రికా ప్రకటన విడుదల చేసింది. నడ్డాతో పవన్ భేటీ అయ్యారని, వీరి మధ్య ప్రధానంగా ఏపీ అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం అనుసరించాల్సిన ప్రణాళికల గురించి చర్చించారని, ఈ సందర్భంగా రాష్ట్రంలో పాలనాపరంగా నెలకొన్న పరిస్థితులను ప్రస్తావించినట్లు తెలిపింది. ప్రస్తుత రాజకీయ పరిణామాలపై చర్చించారన్నారు.
Pawan Kalyan
Janasena
Andhra Pradesh
BJP

More Telugu News