Tollywood: ఇప్పుడు ట్రాఫిక్ డీసీపీలు ఎక్కడంటూ మళ్లీ వార్తల్లోకి నటి డింపుల్ హయతి

Actress Dimple sarcastically tweets about traffic DCPs
  • వర్షాల వల్ల హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌ జాం
  • ఇంటికి వెళ్తుండగా దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిపై ట్రాఫిక్‌లో చిక్కుకున్న డింపుల్
  • అపార్ట్‌మెంట్‌లో పార్కింగ్‌ విషయంలో కొన్ని నెలల కిందట ఓ ట్రాఫిక్‌ డీసీపీతో డింపుల్‌కు గొడవ
గత రెండు రోజుల నుంచి హైదరాబాద్ నగరాన్ని వర్షాలు ముంచెత్తుతున్నాయి. వర్షం కారణంగా ప్రధాన రహదారుల్లో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలుగుతోంది. టాలీవుడ్ హీరోయిన్ డింపుల్ హయతి కూడా నిన్న తన ఇంటికి వెళ్లే దారిలో దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జీపై ట్రాఫిక్ లో చిక్కుకుంది. తనకు ఎదురైన ఇబ్బంది గురించి ఆమె ట్వీట్ చేసింది.

‘మా ఇంటికి చేరుకోవడానికి ఒక గంట కంటే ఎక్కువ సమయం పడుతుంది. ఇంతగా ట్రాఫిక్‌ జామ్‌ అయితే ఇప్పుడు ట్రాఫిక్ డీసీపీలు ఎక్కడున్నారు? ఎవరికైనా మెడికల్ ఎమర్జెన్సీ ఉంటే పరిస్థితి ఏంటి? అసలు మనం ఈ హైదరాబాద్‌లో అడుగు పెట్టగలమా? మాకు ఇంధనం ఉచితంగా ఏమీ రావడం లేదు’ అని ట్వీట్‌ చేసింది.

అయితే, తన ట్వీట్‌లో ట్రాఫిక్‌ డీపీసీల గురించి ప్రస్తావించడం చర్చనీయాంశమైంది. కొన్ని నెలల క్రితం నటి డింపుల్ హయతికి ఆమె అపార్ట్‌మెంట్‌లోనే ఉంటున్న ఐపీఎస్‌ అధికారి, ట్రాఫిక్‌ డీసీపీ రాహుల్ హెగ్డేతో కారు పార్కు విషయంలో గొడవ జరిగింది. అప్పట్లో ఈ విషయం చర్చనీయాంశమైంది. ఆ ఘటనను దృష్టిలో ఉంచుకునే ‘ట్రాఫిక్‌ డీసీపీలు’ అని డింపుల్ ఇప్పుడు వ్యంగ్యంగా ట్వీట్‌ చేసి మళ్లీ వార్తలోకి వచ్చింది.
Tollywood
actress
dimple hayathi
tweet
traffic
DCPs

More Telugu News