Pranitha Subhash: వెనక్కు తగ్గని నటి ప్రణీత..భర్తకు మళ్లీ పాద పూజ..నెట్టింట్లో ఆగని చర్చ

photo of Pranitha doing pada puja goes viral on social media
  • భర్తకు పాద పూజ చేసిన ఫొటో షేర్ చేసిన ప్రణీత
  • ఫొటో విపరీతంగా వైరల్, ఇప్పటివరకూ 1.7 మిలియన్ వ్యూస్
  • పాద పూజ గొప్పదనాన్ని వివరించిన నటి
  • ప్రణీతకు మద్దతుగా నిలిచిన నెటిజన్లు
తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి ప్రణీత. పెళ్లయ్యాక సినిమాలకు దూరమైన ఆమె సోషల్ మీడియాలో నిత్యం అభిమానులతో టచ్‌లో ఉంటుంది.  రెండు రోజుల క్రితం ఆమె తన భర్తకు పాద పూజ చేస్తుండగా తీసిన ఫొటోను షేర్ చేసింది. ప్రతి ఏటా భీమన అమావాస్య నాడు ఆమె ఈ పూజ చేస్తుంటుంది. గతేడాది కూడా ఇలాగే ఫొటో షేర్ చేయగా నెటిజన్లు ఓ రేంజ్‌లో ట్రోల్ చేశారు. ఈ మారూ నెట్టింట సుదీర్ఘంగా చర్చ కొనసాగుతోంది. అయితే, విమర్శలను లెక్కచేయని ప్రణీత తన ఆచారవ్యవహారాలను కొనసాగిస్తోంది. 

ఈ మారు పాద పూజ ఫొటోతో పాటూ దాని గొప్పదనాన్ని వివరించింది ప్రణీత. ‘‘భీమన అమావాస్య సందర్భంగా ప్రతి ఏటా నేను నా భర్తకు పాదపూజ చేస్తుంటాను. గతేడాది ఈ విషయంలో నేను విమర్శలు ఎదుర్కొన్నారు. అలా ట్రోల్ చేసిన వారికి ఇది పితృస్వామ్యంలా కనిపిస్తోందేమో కానీ నాకు మాత్రం ఇది సనాతన ధర్మంలో ఓ భాగమే. దీనికి గొప్ప ప్రాముఖ్యత ఉంది. ఇలాంటి మరెన్నో గొప్ప పూజలు మన ధర్మంలో ఉన్నాయి. వాటి ప్రాముఖ్యతను తెలుపుతూ ఎన్నో కథలు కూడా హిందూ పురాణాల్లో ఉన్నాయి. మన సంస్కృతిలో అందరి దేవతలను ఒకేలా పూజిస్తాం’’ అని చెప్పింది ప్రణీత.

రెండు రోజుల క్రితం ప్రణీత ఈ పొటో షేర్ చేయగా ఇప్పటికీ ఈ అంశంపై నెట్టింట చర్చ జరుగుతూనే ఉంది. ఇప్పటివరకూ ఈ ఫొటోకు 1.9 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. ఈసారి ప్రణీతకు అనేక మంది మద్దతుగా నిలిచారు. సంప్రదాయాలు పాటించేవారు రక్షణాత్మక ధోరణి విడనాడాలని కొందరు ఘాటుగా బదులిచ్చారు. ఎవరికీ సంజాయిషీలు ఇచ్చుకోవాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పారు.
Pranitha Subhash
Viral Pics

More Telugu News