Perni Nani: ఏలూరు జిల్లా కలెక్టర్ పై పేర్ని నాని ఆగ్రహం

Perni Nani fires on Eluru district collector
  • ఉమ్మడి కృష్ణా జిల్లా జడ్పీ సమావేశానికి హాజరుకాని ఏలూరు కలెక్టర్
  • నియంతలా వ్యవహరించవద్దన్న పేర్ని నాని
  • బరితెగింపుతనం ఏ స్థాయి అధికారికి మంచిది కాదని విమర్శ

ఏలూరు జిల్లా కలెక్టర్ తో పాటు జిల్లా ఉన్నతాధికారులపై మాజీ మంత్రి పేర్ని నాని తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. వివరాల్లోకి వెళ్తే ఉమ్మడి కృష్ణా జిల్లా జడ్పీ సమావేశానికి ఏలూరు కలెక్టర్ తో పాటు ఇతర ఉన్నతాధికారులు హాజరు కాలేదు. దీంతో పేర్ని నాని ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఇంకోసారి కలెక్టర్, ఇతర అధికారులు సమావేశానికి రాకుంటే సీఎం జగన్ ఇంటి ముందు నిరసన కార్యక్రమం చేపడతామని పేర్కొంటూ కలెక్టర్ కు లేఖ రాయాలని జడ్పీ ఛైర్ పర్సన్ కు సూచించారు. 

జిల్లా పరిషత్ మీటింగ్ లకు హాజరయ్యే ఉద్దేశం ఏలూరు కలెక్టర్ కు లేదా? అని ప్రశ్నించారు. వ్యవస్థలను లెక్కచేయకపోవడం సరికాదని... నియంతలా వ్యవహరించవద్దని సూచించారు. బరితెగింపుతనం ఏ స్థాయి అధికారికి కూడా మంచిది కాదని అన్నారు.  

  • Loading...

More Telugu News