pm kisan: ఈ నెల 27న 14వ విడత పీఎం కిసాన్ నిధుల విడుదల

Government will release PM Kisan funds next week on this date
  •  ఒక్కో విడతకు రూ.2000 పెట్టుబడి సాయం 
  • ఆధార్, ఎన్పీసీఐ లింక్ అయిన బ్యాంకు ఖాతాలో జమ
  • రాజస్థాన్ లో రైతులతో నిర్వహించే కార్యక్రమంలో నిధుల విడుదల
ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పీఎం కిసాన్ యోజన) 14వ విడత నిధులు వచ్చే వారం కేంద్ర ప్రభుత్వం విడుదల చేయనుంది. ఈ పథకం కింద అర్హులైన రైతులకు ఒక్కో విడతకు రూ.2000 కేంద్రం పెట్టుబడి సాయాన్ని అందిస్తోంది. ఏడాదికి మొత్తం మూడు విడతల్లో రూ.6000 పెట్టుబడి సాయాన్ని ఇస్తోంది.

పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన 14వ విడత నిధులు.. ఆధార్, ఎన్పీసీఐ లింక్ అయిన బ్యాంకు ఖాతాలో జమ చేయబడతాయి. కాబట్టి మీ బ్యాంకు ఖాతాకు ఆధార్, ఎన్పీసీఐ లింక్ ఉందా? లేదా? చూసుకోండి. పీఎం కిసాన్ స్కీమ్ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ ప్రకారం ఈ నెల 27న ప్రధాని మోదీ రాజస్థాన్ లో రైతులతో నిర్వహించే కార్యక్రమంలో నిధులను విడుదల చేయనన్నారు.
pm kisan
farmer
Narendra Modi

More Telugu News