MIM: మేము అంటరానివాళ్లమా?: విపక్షాలపై ఎంఐఎం ఫైర్

MIM dissatisfaction on opposition parties for not inviting them for opposition meet
  • విపక్షాల సమావేశానికి తమను ఆహ్వానించలేదని ఎంఐఎం మండిపాటు
  • 26 విపక్ష పార్టీలు తమను అంటరాని పార్టీగా చూస్తున్నాయన్న ఎంఐఎం ప్రతినిధి
  • 2024లో బీజేపీని ఓడించేందుకు తాము ప్రయత్నిస్తున్నామని వ్యాఖ్య
బెంగళూరులో జరిగిన విపక్షాల సమావేశానికి తమను ఆహ్వానించకపోవడంపై ఎంఐఎం పార్టీ మండిపడింది. ఎంఐఎం అధికార ప్రతినిధి వారిస్ పఠాన్ మాట్లాడుతూ... విపక్షాల సమావేశానికి పిలవకుండా ఎంఐఎంను ఎలా విస్మరిస్తారని ప్రశ్నించారు. లౌకిక పార్టీలుగా చెప్పుకుంటున్న 26 విపక్ష పార్టీలు తమను అంటరాని పార్టీగా చూస్తున్నాయని దుయ్యబట్టారు. వారికి తాము అంటరానివాళ్లుగా కనపడుతున్నామని మండిపడ్డారు.

 2024లో బీజేపీని ఓడించేందుకు తాము ప్రయత్నిస్తున్నామని, అయినా వాళ్లు తమను విస్మరిస్తున్నారని అన్నారు. నితీశ్ కుమార్, ఉద్ధవ్ థాకరే, మెహబూబా ముఫ్తీ వంటి వారు ఒకప్పుడు బీజేపీతో కలిసి పని చేసినవారేనని చెప్పారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ను విమర్శించిన అరవింద్ కేజ్రీవాల్ ఇప్పడు కాంగ్రెస్ తో కలిసి బెంగళూరులో కూర్చున్నారని అన్నారు. 

MIM
Opposition Meet
BJP
Congress

More Telugu News