Bhadrachalam: భద్రాచలం వద్ద అంతకంతకు పెరుగుతున్న గోదావరి నీటి మట్టం

Godavari water level increasing near Bhadrachalam
  • ఎగువన కురుస్తున్న వర్షాలతో గోదావరికి భారీగా వరదనీరు
  • భద్రాచలం వద్ద 28.9 అడుగులకు చేరిన నీటి మట్టం
  • లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసిన అధికారులు

ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరి నదికి వరదనీరు పోటెత్తుతోంది. ఈ క్రమంలో భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది. నిన్న సాయంత్రం 20 అడుగులు ఉన్న నీటి మట్టం ఈరోజు మధ్యాహ్నం ఒంటి గంటలకు 28.9 అడుగులకు చేరుకుంది. ఎగువ ప్రాంతాల్లోని ప్రాజెక్టులకు కూడా భారీగా వరద నీరు చేరుతుండటంతో... గేట్లు ఎత్తి నీటిని కిందకు విడుదల చేస్తున్నారు. దీంతో, మరో 24 గంటల్లో నది నీటి మట్టం మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని అధికారులు అంచనా వేస్తున్నారు. 

నీటి మట్టం పెరుగుతుండటంతో భద్రాచలంలోని స్నాన ఘట్టాలు చాలామటుకు మునిగిపోయాయి. శ్రీరాముడి దర్శనానికి వచ్చిన భక్తులు స్నానం చేసేటప్పుడు ఎక్కువ లోతుకు వెళ్లవద్దని బోర్డులు ఏర్పాటు చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేస్తున్నారు.  

  • Loading...

More Telugu News