Bengaluru: బెంగళూరులో ఉగ్రదాడుల కుట్ర భగ్నం

 5 suspected terrorists arrested for planning explosions in Bengaluru
  • ఐదుగురు ఉగ్రవాదులను అరెస్ట్ చేసిన పోలీసులు
  • వారి నుంచి పేలుడు పదార్థాల స్వాదీనం
  • మరో ఐదుగురు అనుమానితులపై నిఘా
కర్ణాటక రాజధాని బెంగళూరులో ఉగ్రదాడుల కుట్రను పోలీసులు నిర్వీర్యం చేశారు. నగరవ్యాప్తంగా దాడులకు ప్లాన్ చేసినట్టుగా భావిస్తున్న ఐదుగురు ఉగ్రవాదులను సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ (సీసీబీ) బెంగళూరులో అరెస్టు చేసింది. అరెస్టయిన వారిని జునైద్, సోహైల్, ఉమర్, ముదాసిర్, జాహిద్‌లుగా గుర్తించారు. వారి నుంచి మొబైల్‌ ఫోన్లతో పాటు పలు పేలుడు పదార్థాలు, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు.  తదుపరి విచారణ నిర్వహిస్తున్నారు. 

ఉగ్ర దాడుల ప్రణాళికలో ప్రమేయం ఉన్నట్లు అనుమానిస్తున్న మరో ఐదుగురి కోసం సీసీబీ నిఘా పెట్టింది. ఇక అరెస్టయిన ఐదుగురు నిందితులకు 2017లో జరిగిన ఓ హత్యకేసులో ప్రమేయం ఉందని పోలీసులు తెలిపారు. ఆ హత్య కేసులో బెంగుళూరు సెంట్రల్ జైలుకి వెళ్లిన ఐదుగురికి అక్కడ కొంతమంది ఉగ్రవాదులతో పరిచయం ఏర్పడిందని తెలిపారు. ఉగ్రదాడులకు శిక్షణ పొందారని వెల్లడించారు. నగరంలో ఉగ్ర దాడులకు సంబంధించిన ప్లాన్‌పై సీసీబీకి సమాచారం అందడంతో నిందితులను అరెస్ట్ చేశారు.
Bengaluru
terrorists
5 members
arrest
explosions

More Telugu News