Vaishnavi Chaitanya: 'బేబి' కోసం వైష్ణవిని సెలెక్ట్ చేస్తే అలా అన్నారు: నిర్మాత ఎస్ కె ఎన్!

SKN Interview
  • క్రితం వారం థియేటర్లకు వచ్చిన 'బేబి'
  • వసూళ్ల పరంగా దూసుకుపోతున్న సినిమా 
  • వైష్ణవి గొప్పగా చేసిందంటూ కితాబు 
  • ఆమె నెక్స్ట్ లెవెల్ కి వెళుతుందని వ్యాఖ్య 

క్రితం వారం థియేటర్స్ కి వచ్చిన 'బేబి' సినిమా, వసూళ్ల పరంగా దూసుకుపోతోంది. ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీలో నటన పరంగా వైష్ణవి చైతన్య ఎక్కువ మార్కులను కొట్టేసింది. ఈ సినిమాకి ఆమెనే ప్రత్యేకమైన ఆకర్షణగా నిలిచింది. రొమాన్స్ పరంగా .. ఎమోషన్స్ పరంగా ఎక్కువ భారాన్ని మోసింది. దాంతో ఆమెకి వరుస ఆఫర్లు వచ్చిపడుతున్నాయనే ఒక టాక్ బలంగా వినిపిస్తోంది.

ఈ సినిమాను ఎస్.కె. ఎన్. నిర్మించాడు. తాజాగా 'తెలుగు వన్'కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, " ఈ సినిమా ఫస్టు కాపీని అల్లు అరవింద్ గారు చూశారు. 'ఇంత బాగా చేస్తోంది .. ఎవరు ఈ అమ్మాయి' అని ఒకటికి నాలుగు సార్లు అడిగారు. 'తెలుగు అమ్మాయినే సార్' అని చెప్పగానే ఆశ్చర్యపోయారు. 

నిజానికి వైష్ణవిని తీసుకున్నప్పుడు, ఆమె యూట్యూబ్ లోనే కదా ఇంతవరకూ చేసిందంటూ కొంతమంది నిరాశపరిచారు. బాలీవుడ్ ను ఏలుతున్న చాలామంది హీరోయిన్స్ టీవీల నుంచి వచ్చిన వారే కదా అనుకున్నాను. ఎవరి మాటలనూ పట్టించుకోకుండా ఆమెనే ఎంపిక చేసుకున్నాము. ఆమె ఆ పాత్రను అద్భుతంగా చేసింది .. నాకు తెలిసి తాను తప్పకుండా నెక్స్ట్ లెవెల్ హీరోయిన్ అవుతుంది" అంటూ చెప్పుకొచ్చాడు. 

  • Loading...

More Telugu News