Protest: చత్తీస్ గఢ్ లో పురుషుల దిగంబర నిరసన ప్రదర్శన... కారణం ఇదే!

Naked protest in Raipur
  • రాయ్ పూర్ లో దిగ్భ్రాంతి కలిగించిన నిరసన ర్యాలీ
  • ఒంటిపై బట్టల్లేకుండా ప్లకార్డులు చేతపట్టి నిరసనలు
  • నకిలీ కుల ధ్రువీకరణ పత్రాలతో ప్రభుత్వ ఉద్యోగాలు పొందుతున్నారని ఆరోపణ
  • ప్రభుత్వం చర్యలు తీసుకోవడంలేదంటూ ఆగ్రహం
  • నిరసనకారులను అదుపులోకి తీసుకున్న పోలీసులు

చూసిన జనాలు సిగ్గుపడేలా చత్తీస్ గఢ్ లో ఓ నిరసన ప్రదర్శన జరిగింది. అందుకు కారణం... నిరసన ప్రదర్శనలో పాల్గొన్న పురుషుల్లో ఏ ఒక్కరికీ ఒంటిమీద దుస్తులు లేకపోవడమే. వారంతా దిగంబరంగా మారి నిరసన చేపట్టారు. వివరాల్లోకెళితే.... చత్తీస్ గఢ్ లో నకిలీ కుల ధ్రువీకరణ పత్రాలతో ప్రభుత్వ ఉద్యోగాలు పొందుతున్నారంటూ కొంతకాలంగా తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి. 

అయితే, ప్రభుత్వం పట్టించుకోవడంలేదంటూ కొందరు పౌరులు రోడ్డెక్కారు. నగ్నంగా మారి, ప్లకార్డులు చేతబట్టి నినాదాలు చేసుకుంటూ చత్తీస్ గఢ్ రాజధాని రాయ్ పూర్ లో అసెంబ్లీ దిశగా ర్యాలీ చేపట్టారు. ఈ దిగంబర ర్యాలీకి సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. 

దీనిపై పోలీసులు వెంటనే స్పందించారు. నిరసనకారులను అదుపులోకి తీసుకున్నారు. నగ్నంగా ర్యాలీ చేపట్టి, అసభ్యకర ప్రదర్శన చేస్తున్నారంటూ వారిపై కేసు నమోదు చేశారు. 

కాగా, గతంలో తాము సాధారణ రీతిలో నిరసనలు చేపడితే ఎవరూ పట్టించుకోలేదని, అందుకే నగ్నంగా నిరసన చేపట్టామని నిరసనకారులు వెల్లడించారు. నకిలీ కుల సర్టిఫికెట్ల వ్యవహారంపై ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకోవాల్సిందేనని డిమాండ్ చేశారు. తప్పుడు కుల ధ్రువీకరణ సర్టిఫికెట్లతో 267 మంది ఉద్యోగాలు పొందినా, ఇప్పటివరకు చర్యలు లేవని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News