Sai Dharam Tej: నా డ్యాన్సులు చూసి నేను కూడా నిరాశపడ్డాను: సాయి ధరమ్ తేజ్

I am also disappointed with my dance says Sai Dharam Tej
  • యాక్సిడెంట్ తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన తేజూ
  • బ్లాక్ బస్టర్ మూవీ 'విరూపాక్ష'తో గ్రాండ్ రీఎంట్రీ
  • గతంలో మాదిరి తేజూ డ్యాన్స్ మూమెంట్స్ లేవని ఫ్యాన్స్ నిరాశ
  • ట్రీట్మెంట్ లో స్టెరాయిడ్స్ వాడటం వల్ల శరీరంలో ఇబ్బందులు ఉన్నాయన్న మెగా హీరో
  • ఫిట్ నెస్ కోసం ప్రయత్నిస్తున్నానని వెల్లడి
మెగా హీరో సాయి ధరమ్ తేజ్ యాక్సిడెంట్ కు గురైన తర్వాత గ్రాండ్ గా రీఎంట్రీ ఇచ్చాడు. తేజూ నటించిన 'విరూపాక్ష' చిత్రం ఘన విజయం సాధించింది. ఇప్పుడు తన తాజా చిత్రం 'బ్రో' విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ నెల 28న విడుదల కానున్న ఈ చిత్రంలో ఆయన మేనమామ, జనసేనాని పవన్ కల్యాణ్ కూడా నటించారు. ప్రముఖ నటుడు సముద్రఖని ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. అయితే గతంలో ఉన్నంత స్థాయిలో ఇందులో తేజూ డ్యాన్స్ మూమెంట్స్ లేవని కామెంట్స్ వినిపిస్తున్నాయి. 

ఈ కామెంట్స్ పై తాజాగా ఓ ఇంటర్వ్యూలో ధరమ్ తేజ్ స్పందించాడు. యాక్సిడెంట్ తర్వాత ట్రీట్మెంట్, మెడిసిన్స్ వల్ల శరీరంలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయని చెప్పాడు. తన డ్యాన్స్ ను చూసి అభిమానులే కాకుండా తాను కూడా నిరాశపడ్డానని తెలిపాడు. బాడీలో ఫిజికల్ మూమెంట్స్ కు కొన్ని సమస్యలు ఉన్నాయని వెల్లడించాడు. గతంలో కంటే కూడా బెటర్ గా డ్యాన్స్ చేయగలనని, అయితే దీనికి కొంత సమయం పడుతుందని చెప్పాడు. 

యాక్సిడెంట్ అయిన తర్వాత కొన్ని రోజుల పాటు కనీసం మాట్లాడలేకపోయానని... ఆ సమస్యను అధిగమించానని తేజూ చెప్పాడు. తాను కోమాలో ఉన్నప్పుడు స్టెరాయిడ్స్ ఇచ్చారని... అవి తన శరీరంపై తీవ్ర ప్రభావం చూపాయని తెలిపాడు. ఫిట్ నెస్ ను మళ్లీ సాధించాల్సి ఉందని... ప్రస్తుతం ఆ పని పైనే ఉన్నానని చెప్పాడు.
Sai Dharam Tej
Tollywood
Dance
Fitness

More Telugu News