Andhra Pradesh: అన్నమయ్య జిల్లాలో దారుణం.. టమాటాకు కాపలాగా ఉన్న రైతు హత్య!

Andhra Farmer Guarding Tomatoes Strangled  Second Such Death In A Week
  • ఆంధ్రప్రదేశ్‌లోనే వారం రోజుల్లో రెండో ఘటన
  • ఆదివారం రాత్రి పెద్దతిప్ప సముద్రంలో రైతు హత్య
  • సోమవారం ఉదయం పొలం వద్ద మృతదేహాన్ని చూసి షాకైన కుటుంబ సభ్యులు
ఆంధ్రప్రదేశ్ లోని అన్నమయ్య జిల్లాలో దారుణం జరిగింది. మరో టమాటా రైతు హత్య జరిగింది. వారం రోజుల్లో ఇది రెండో ఘటన. వారం క్రితం ఇదే జిల్లాలోని బోడుమల్లదిన్నె గ్రామంలో టమాటాల కోసం రైతు నరేం రాజశేఖరరెడ్డిని హత్య చేశారు. ఆదివారం రాత్రి పెద్దతిప్పసముద్రం గ్రామానికి చెందిన మధుకరరెడ్డి అనే రైతును గుర్తు తెలియని దుండగులు హత్య చేసి, టమాటాలు తీసుకెళ్లారు.

టమాటా ధర భారీగా పెరిగింది. దీంతో రైతులు తమ టమాటాను కాపాడుకోవడం కోసం పొలం వద్దే ఉంటున్నారు. చాలామంది రైతులు రాత్రుళ్లు కూడా అక్కడే నిద్రిస్తున్నారు. టమాటా పంటకు కాపలాగా ఉన్న మధుకరరెడ్డిని ఆదివారం రాత్రి దుండగులు హత్య చేశారు. సోమవారం ఉదయం పొలం వద్దకు వెళ్లిన కుటుంబ సభ్యులు అతని శవాన్ని చూసి హతాశులయ్యారు. పోలీసులకు సమాచారం అందించడంతో కేసు నమోదు చేసుకొని, దర్యాఫ్తు చేస్తున్నారు.
Andhra Pradesh
farmer
tomato

More Telugu News