Ajit Pawar: 24 గంటల వ్యవధిలో శరద్ పవార్ ను రెండోసారి కలిసిన అజిత్ పవార్

Ajit Pawar meets Sharad Pawar second time in 24 hours
  • ఎన్సీపీని చీల్చిన అజిత్ పవార్ 
  • శరద్ పవార్ ఆశీస్సులు కావాలని కోరుతున్న అజిత్ వర్గం
  • నిన్న కూడా శరద్ పవార్ ను కలిసిన వైనం

ఎన్సీపీ అధినేత శరద్ పవార్ పై అజిత్ పవార్ వర్గం తిరుగుబాటు చేసి ఏక్ నాథ్ షిండే ప్రభుత్వంలో చేరడంతో మహారాష్ట్ర రాజకీయాలు కీలక మలుపులు తిరిగాయి. మరోవైపు మీ ఆశీర్వాదాలు కావాలంటూ శరద్ పవార్ ను అజిత్ కోరుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో శరద్ వవార్ ను అజిత్ పవార్ మరోసారి కలిశారు. గత 24 గంటల్లో శరద్ పవార్ ను కలవడం ఇది రెండో సారి. నిన్నటి మీటింగ్ తర్వాత అజిత్ వర్గం నేత ప్రఫుల్ పటేల్ మాట్లాడుతూ... పార్టీ చీలలేదని ప్రకటించాలని కోరినట్టు చెప్పారు. అయితే, పవార్ ఏమీ మాట్లాడలేదని, తాము చెప్పేది మౌనంగా విన్నారని అన్నారు. పార్టీని చీల్చిన అజిత్ పవార్ మహారాష్ట్ర డిప్యూటీ సీఎం పదవిని చేపట్టిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News