Bhumana Karunakar Reddy: వినతిపత్రం పేరుతో దండయాత్రకు వస్తున్నట్టు ఉంది.. ​పవన్‌పై వైసీపీ ఎమ్మెల్యే ఫైర్

bhumana karunakar reddy fires on pawan kalyan tirupati visit
  • తిరుపతిపై పవన్‌ దాడికి దిగుతున్నట్టు ఉందన్న భూమన కరుణాకర్‌‌రెడ్డి
  • తమ పార్టీపై నిత్యం నిందలు వేస్తున్నాడని మండిపాటు
  • నిత్యం పగ, ప్రతీకారాలతో భీష్మ ప్రతిజ్ఞలు చేస్తున్నాడని వ్యాఖ్య
జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌పై తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి మండిపడ్డారు. వినతిపత్రం పేరుతో తిరుపతికి పవన్‌ దండయాత్రకు వస్తున్నట్టు ఉందంటూ సెటైర్లు వేశారు. సోమవారం మీడియాతో భూమన మాట్లాడుతూ.. ఆధ్యాత్మిక నగరం తిరుపతిపై పవన్‌ దాడికి దిగుతున్నట్టు ఉందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

‘‘వినతిపత్రం పేరుతో పవన్‌ దండయాత్రకు వస్తున్నట్టు ఉంది. ప్రజాస్వామ్యబద్ధంగా ఉన్న మా పార్టీపై నిత్యం నిందలు వేస్తున్నాడు. పవన్‌.. తనకు ఓటు వేస్తే ఏం చేస్తాడో చెప్పకుండా నిత్యం పగ, ప్రతీకారాలతో భీష్మ ప్రతిజ్ఞలు చేస్తున్నాడు” అని విమర్శలు చేశారు.

జనసేన కార్యకర్తపై శ్రీకాళహస్తి సీఐ అంజు యాదవ్ చెయ్యి చేసుకున్న వ్యవహారం దుమారం రేపిన విషయం తెలిసిందే. అంజు యాదవ్‌పై ఎస్పీకి ఫిర్యాదు చేయడం కోసం పవన్ కల్యాణ్ తిరుపతికి చేరుకున్నారు.
Bhumana Karunakar Reddy
Pawan Kalyan
Tirupati
Srikalahasti
Janasena
YSRCP

More Telugu News