Bollywood: షారుఖ్ ‘పఠాన్‌’ కలెక్షన్లపై కాజోల్ కామెంట్లపై దుమారం!

Kajol asks SRK how much did Pathaan really make sparks controversy
  • ఆ సినిమా అసలైన కలెక్షన్ చెప్పమని షారుఖ్ ను అగుతానన్న కాజోల్
  • షారుఖ్ తో కలిసి ఏడు సినిమాల్లో నటించిన సీనియర్ నటి
  • బాలీవుడ్‌ లో హిట్‌ జంటగా ఇద్దరికీ మంచి గుర్తింపు
బాలీవుడ్‌ హిట్ జంటల్లో షారుఖ్ ఖాన్, కాజోల్ ముందుంటారు. గత మూడు దశాబ్దాలుగా వెండితెరపై ఈ ఇద్దరూ ఎన్నో చిత్రాల్లో కనిపించారు. 30 ఏళ్ల క్రితం వచ్చిన మొదటి సినిమా ‘బాజీగర్‌’ నుంచి 2015లో విడుదలైన ‘దిల్‌వాలే’ వరకు మొత్తం ఏడు చిత్రాల్లో జంటగా నటించిన ఈ ఇద్దరూ ప్రేక్షకులను అలరించారు. ఇద్దరి మధ్య ఇప్పటికీ మంచి స్నేహం, అనుబంధం కూడా వున్నాయి. ఇదే విషయాన్ని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో కాజోల్ వెల్లడించింది. షారుఖ్‌ తనకు ఆప్త మిత్రుడని, ఇప్పటికీ ఆయనతో కలిసి ఓ రొమాంటిక్‌ పాటలో నటించాలని ఉందని చెప్పింది. ఈ క్రమంలో ఆమె షారుక్ గత చిత్రం ‘పఠాన్’ గురించి చేసిన వ్యాఖ్యలు బాలీవుడ్ లో దుమారం రేపుతున్నాయి.

తన తాజా వెబ్ సిరీస్‌ ‘ది ట్రయల్’ ప్రమోషన్స్ లో భాగంగా  ఇంటర్వ్యూలో పాల్గొన్న కాజోల్‌కు ‘ఇప్పుడు షారుఖ్‌ మీకు ఎదురైతే మీరు ఏం అడుగుతారు’ అనే ప్రశ్న ఎదురైంది. దీనికి ‘పఠాన్‌’ ఒరిజినల్ కలెక్షన్స్‌ ఎంతో చెప్పమని అడుగుతానంటూ నవ్వుతూ సమాధానం ఇచ్చింది. కాజోల్ సరదాగా ఈ మాట చెప్పినప్పటికీ ‘పఠాన్’ సినిమాకు వచ్చిన వెయ్యి కోట్ల కలెక్షన్స్‌ లో నిజం లేదని అర్థం ఉందటూ షారుఖ్ అభిమానులు ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాలీవుడ్‌లో షారుఖ్ తో పోటీపడే కాజోల్ భర్త అజయ్ దేవగణ్ ఆమెతో పఠాన్ కలెక్షన్ల గురించి చర్చించి ఉంటాడని, అందుకే ఆమె ఇలా ఎద్దేవా చేసిందని అంటున్నారు. ఈ వివాదం ఎంత దూరం వెళ్తుందో చూడాలి.
Bollywood
kajol
Shahrukh Khan
pathan movie
collections

More Telugu News