Ileana D'Cruz: మొత్తానికి బాయ్‌ఫ్రెండ్ ముఖాన్ని ప్రపంచానికి చూపించిన నటి ఇలియానా

Ileana DCruz Reveals Mystery Mans Face
  • దాగుడుమూతలకు తెరదించిన ఇలియానా
  • ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో లైఫ్ పార్ట్‌నర్ ఫొటోలు షేర్ చేసిన నటి
  • బ్లాక్ షర్ట్, గడ్డంతో ఉన్న వ్యక్తితో సన్నిహితంగా ఉన్న ఫొటోలను పంచుకున్న ఇలియానా
ఇటీవల ప్రెగ్నెంట్ అయిన నటి ఇలియానా ఎప్పటికప్పుడు తన బేబీ బంప్ ఫొటోలను అభిమానులతో పంచుకుంటున్నారు. ఈ క్రమంలో తన బాయ్‌ఫ్రెండ్ ఫొటోలను కూడా షేర్ చేస్తున్నప్పటికీ ముఖాన్ని మాత్రం కనిపించకుండా దాచిపెడుతున్నారు. దీంతో ఆయన ఎవరై ఉంటారన్న చర్చ విస్తృతంగా సాగింది. ఈ క్రమంలో చాలామంది పేర్లు తెరపైకి వచ్చాయి. అయినప్పటికీ ఫొటోలను షేర్ చేయడం మాత్రం ఆపలేదు. దీంతో ఆ మిస్టరీ మ్యాన్‌‌ గురించి తెలుసుకోవాలన్న ఆసక్తి అందరికీ పెరిగింది.

తాజాగా ఈ దాగుడుమూతలకు ఇలియానా తెరదించారు. ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో తన జీవితంలోకి వచ్చిన ఆ వ్యక్తి ముఖాన్ని రివీల్ చేశారు. బ్లాక్ షర్ట్ ధరించి, గడ్డంతో వ్యక్తితో సన్నిహితంగా ఉన్న ఫొటోలను షేర్ చేశారు. అయితే, ఆయనకు సంబంధించిన వివరాలను మాత్రం వెల్లడించలేదు. గతంలోనూ తన లైఫ్‌పార్ట్‌నర్‌కు సంబంధించిన ఫొటోలను షేర్ చేసినప్పటికీ ముఖాన్ని మాత్రం దాచిపెట్టారు.
 
Ileana D'Cruz
Actress
Ileana Boy Friend

More Telugu News