Low pressure: బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన!

Low pressure form in bay of bengal from July 18 Heavy rains expected next three days
  • మరో మూడు రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు
  • ఏపీతో పాటు తెలంగాణలోని పలు జిల్లాలను ముంచెత్తనున్న వాన
  • ఉరుములు మెరుపులతో కూడిన జల్లులు పడతాయన్న వాతావరణ శాఖ
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాలలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. రాబోయే మూడు రోజుల పాటు ఏపీ, తెలంగాణలోని పలు జిల్లాలను వర్షాలు ముంచెత్తుతాయని వివరించింది. ఉత్తరకోస్తా, దక్షిణ కోస్తాలలో పలుచోట్ల, రాయలసీమలో అక్కడక్కడా వర్షాలు కురుస్తాయని పేర్కొంది.

నేడు పార్వతీపురం, శ్రీకాకుళం, మన్యం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో మోస్తరుగా వర్షాలు కురవనున్నాయి. ఉత్తరాంధ్రలో విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, ఉభయ గోదావరి జిల్లాలు, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, పల్నాడు, గుంటూరు, బాపట్ల, నంద్యాల, కర్నూలు జిల్లాల్లో మోస్తరు వానలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది.

వాయవ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కాస్తా అల్పపీడనంగా మారిందని, మంగళవారం నాటికి అది వాయుగుండంగా బలపడనుందని తెలిపింది. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులతో పాటు అక్కడక్కడా పిడుగులు పడవచ్చని ఐఎండీ అధికారులు తెలిపారు. తెలంగాణలోనూ ఈరోజు, రేపు (సోమ, మంగళవారాల్లో) భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.
Low pressure
bay of bengal
rains

More Telugu News