Vijayasai Reddy: చంద్రబాబుకు ఇదే ఆఖరి పోరాటం: విజయసాయిరెడ్డి

This is final fight for Chandrababu says Vijayasai Reddy
  • రాజకీయాల్లో మళ్లీ వేగం పెంచుతున్న విజయసాయిరెడ్డి
  • ఉదయమో చోద్యం, సాయంత్రమో వింత అనేది బాబు నైజమని ఎద్దేవా
  • ఖరీదైన దుష్ప్రచార క్యాంపెయిన్ మొదలు పెట్టించారని విమర్శ
చాలా రోజుల పాటు మౌనంగా ఉన్న వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి మళ్లీ యాక్టివ్ అవుతున్నారు. ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న తరుణంలో ఆయన మళ్లీ వేగం పెంచుతున్నారు. తాజాగా కాసేపటి క్రితం ఆయన ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ... టీడీపీ అధినేత చంద్రబాబుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఉదయమో చోద్యం, సాయంత్రమో వింత అనే బాబుగారి నైజం ప్రజల్ని ఎమోషన్, కామెడీ, సెంటిమెంటు, విషాదంలో ముంచెత్తుతున్నాయని ఆయన అన్నారు. ఏకపత్నీవ్రతుడైన రాముని ఇల్లాలు సీతమ్మ వారి ప్రస్తావనను కూడా తెస్తున్నారని... పోలికకు కూడా ఒక హద్దు ఉండాలని చెప్పారు. బాబుగారికి ఇది ఆఖరి పోరాటం కాబట్టే ఖరీదైన దుష్ప్రచార క్యాంపెయిన్ మొదలు పెట్టించారు కాబోలు అని ఎద్దేవా చేశారు.
Vijayasai Reddy
YSRCP
Chandrababu
Telugudesam

More Telugu News