Vande Bharat Express: వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ఇంజిన్‌లో మంటలు.. వీడియో ఇదిగో!

Bhopal Delhi Vande Bharat Express Catches Fire
  • భోపాల్ నుంచి ఢిల్లీ వెళ్తున్న రైలులో ప్రమాదం
  • అప్రమత్తమై రైలును కేథోరా స్టేషన్‌లో నిలిపేసిన లోకోపైలట్
  • మంటలు అదుపు చేసిన అగ్నిమాపక సిబ్బంది

వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లకు జరుగుతున్న వరుస ప్రమాదాలు కలవరపెడుతున్నాయి. తాజాగా మధ్యప్రదేశ్‌లో ఈ తెల్లవారుజామున మంటలు అంటుకున్నాయి. వెంటనే రైలును నిలిపివేసి మంటలు అదుపు చేయడంతో పెను ప్రమాదం తప్పింది. ఢిల్లీ వెళ్తున్న రాణి కమలాపతి (భోపాల్)-హజ్రత్ నిజాముద్దీన్ (ఢిల్లీ) వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలులో ఈ ఘటన చోటుచేసుకుంది. రైలు ఇంజిన్‌కు ఒక్కసారిగా మంటలు అంటుకోవడంతో అప్రమత్తమైన లోకోపైలట్ కుర్వాయి కేథోరా స్టేషన్‌లో రైలును నిలిపివేశాడు. 

సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది రైలు ఇంజిన్ వద్ద చెలరేగిన మంటలను అదుపు చేశారు. ఇంజిన్‌కు మంటలు అంటుకోవడంతో రైలు ఆపిన వెంటనే ప్రయాణికులు కిందికి దిగి పక్కనే కూర్చున్నారు. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

  • Loading...

More Telugu News